ఇలియానా పై బ్యాన్.. అందుకే ఇక్కడ సినిమాలు చేయట్లేదా..!?

Anilkumar
దేవదాసు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా మంచి గుర్తింపును పొందింది గోవా బ్యూటీ ఇలియానా. గతంలో తెలుగులో ఏమి వరుస సినిమాలో చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి దూరమైంది.దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ఇలియానా 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాతో కనిపించింది. ఇక ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో తన ఫోకస్ మొత్తం హిందీ సినిమాల వైపు పెట్టింది ఇలియానా. అప్పటినుండి తెలుగు సినిమాల్లో కనిపించలేదు ఈమె. సౌత్ ఇండస్ట్రీలో ఇలియానా కనిపించకపోవడానికి కారణం ఏంటి అని ఆరాధిస్తున్నారు. 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళ్ చిత్ర సీమ  నిషేధం విధించిందని అందుకు కారణం ఒక అగ్ర నిర్మాత అని అంటున్నారు.. అయితే మొదట అక్కడ సినిమా చేయడానికి ఇలియానా అడ్వాన్స్ కూడా తీసుకుందట.. చిత్రీకరణ సమయానికి మాత్రం హాజరు కాలేదని.. దాంతో ఆ సమయంలో ఇలియానా స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకున్నారని.. అడ్వాన్స్ ఇవ్వాలని కోరగా ఇలియానా అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వలేదని.. దీంతో ఆ నిర్మాత ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారని.. దాంతోపాటు టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ లో సైతం ఆయన ఫిర్యాదు చేశారని..

బ్యాన్ చేయాలని కోరాడట దీంతో ఈ సమస్య కి పరిష్కారం దొరికినంత వరకు ఇలియానాని ఈ సినిమాకి తీసుకోవద్దని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.. అయితే బహుశా ఈ కారణంగానే ఇలియానా ఇక్కడ సినిమాలు చేయట్లేదు అని అంటున్నారు.. ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల ఇలియానా ఈ సమస్యను పరిష్కరించుకుందని త్వరలోనే ఇక్కడ కూడా సినిమాలు చేస్తోందనే ప్రచారం జరుగుతుంది.. ఇదిలా ఉంటే ఇక ఇటీవల ఇలియానా అనారోగ్యానికి గురైనా సంగతి మనందరికీ తెలిసిందే.. ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఇలియానా.. ఇందులో భాగంగానే సకాలంలో వైద్యులు తనకి మంచి వైద్యాన్ని అందించాలని కూడా ఆమె పేర్కొంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: