ఈరోజు ఆ సమయానికి ఏజెంట్ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అక్కినేని అఖిల్ కొంత కాలం క్రితం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ విజయంతో మంచి జోష్ లో ఉన్న అఖిల్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండగా , ఈ సినిమాకు హిప్ హాప్ తమిజ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేయగా ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తర్వాత అఖిల్ నటిస్తున్న మూవీ కావడం సైరా నరసింహా రెడ్డి లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన మూవీ కావడంతో ఏజెంట్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఏజెంట్ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ కి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 14 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఏజెంట్ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ ను విడుదల చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: