సిల్క్ స్మిత ఆఖరి కోరిక తీర్చిన ఆ స్టార్ హీరో..?

murali krishna
హాట్ భామ అయిన సిల్క్ స్మిత 80వ దశకంలో దక్షిణాది చిత్ర సీమను పరిపాలించింది.. స్టార్ హీరోలు ఆమె డేట్స్ కోసం తెగ ఆరాటపడేవారు. 

ఒక్క సాంగ్ చేయరూ అంటూ సిల్క్ స్మిత కోసం వెంటపడేవారు. కళ్లతో ఆమె ఒక్క ఎక్స్‌ప్రెషన్ ఇస్తే చాలు కుర్రాళ్లు అందరూ కూడా క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే. అయితే 36 ఏళ్ళకే ఆమె ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.ఆమెది హత్య అని ఇప్పటికీ వాదించేవాళ్లు కూడా ఉన్నారు. ఆమె ప్రేమ విఫలమై ఇలాంటి నిర్ణయం తీసుకుందని అలాగే నిర్మాణ రంగంలోకి దిగి పెద్ద ఎత్తున నవ్వుల పాలు అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. మద్యపానమే ఆమెను బలి తీసుకుంది అనేవారు కూడా వున్నారు.

చనిపోవటానికి ముందురోజు సాయంత్రం రాత్రి సిల్క్ స్మిత చాలా మందికి ఫోన్ చేసినట్టు కూడా ఆ తరువాత చాలామంది ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.కన్నడ నటుడు రవిచంద్రన్ మొదలు తెలుగు నటి అయిన అనూరాధ దాకా చాలామంది బాగా బాధపడ్డారు. స్పందించకపోవటానికి ఏవేవో కారణాలు కూడా చెప్పుకొచ్చారు.. బయటకి చెప్పనివాళ్ళు కూడా ఇంకెంతమంది ఉన్నారో మరి.. చనిపోయాక ఆమెతో అవసరం తీరిపోయిందనుకున్న చిత్ర పరిశ్రమ కనీసం ఒక సంస్మరణ సభ కూడా చేయలేదు.

సిల్క్ స్మిత చనిపోయిన వార్త విని సినీ పరిశ్రమ అంతా దిగ్భ్రాంతికి గురయ్యింది. అయితే ఆమె ఆఖరి చూపు చూసేందుకు ఎవరూ రాకపోవడం ఒకింత భాధకు గురిచేసింది. సిల్క్‌ను చివరి సారి చూసేందుక అప్పటి టాప్ హీరో అయిన అర్జున్ మాత్రమే వచ్చారు. అప్పటికి ఎవరూ పట్టించుకోకపోయిన అర్జున్ మాత్రమే వచ్చి చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించారు.. ఆ మాటే కొందరు జర్నలిస్టులు ఆయన్ను డైరెక్ట్‌గా కూడా అడిగేశారు. అంతకు కొద్ది రోజుల ముందే ఒక షూటింగ్ చివరి రోజు అర్జున్ తో "నేను చచ్చిపోతే చూడ్డానికి వస్తావా"? అని సిల్క్ అడిగిందట. "ఛీ అదేం మాట" అని తేలిగ్గా కొట్టిపారేశాడే తప్ప సీరియస్ గా అయితే తీసుకోలేదు. "ఎవరూ రాకపోయినా మీరు రావటం ఆశ్చర్యంగా ఉంది" అన్నప్పుడు ఇది గుర్తు చేసుకొని బోరుమని ఏడ్చేసాడట

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: