బాక్స్ ఆఫీస్ పై పఠాన్ దండయాత్ర.. 5 రోజుల్లో 550 కోట్లు?

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ వద్ద రికార్డుల జోరును కొనసాగిస్తోంది. ఐదు రోజుల్లోనే ఏకంగా రూ.500కోట్ల క్లబ్లోకి ఈ సినిమా ప్రవేశించింది.ఈ సినిమా భారీ వసూళ్లనే కాకుండా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇక ఐదో రోజు కేవలం హిందీలో రూ.60 నుంచి 65కోట్లు సాధించినట్లు సమాచారం తెలిసింది. మొత్తంగా ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 67.84 మిలియన్ డాలర్ల అంటే భారత కరెన్సీలో ఏకంగా రూ.550కోట్లు సాధించినట్లు తెలిసింది. ఇండియాలో రూ.280కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక యూఏఈలో ఫస్ట్ వీకెండ్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో  ఈ సినిమా రెండో స్థానంలో నిలిచింది. అవెంజర్స్ ఎండ్గేమ్ రూ.5.94మిలియన్ డాలర్స్తో మొదటి ప్లేస్ లో ఉండగా.. ఇక పఠాన్ 4.80మిలియన్ డాలర్స్, ఎఫ్ 8 4.64 మిలియన్ డాలర్స్, తో రెండు, మూడు స్థానాల్లో వున్నాయి.


ఇక పఠాన్ సినిమా ఇండియాలో రూ.250 కోట్ల క్లబ్లోకి కేవలం 5 రోజుల్లోనే ఎంటర్ అయ్యి రికార్డు సాధించిందని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. కేజీయఫ్ 2.. సినిమా రూ. 250 కోట్ల క్లబ్‌లోకి 7 రోజుల్లో చేరితే.. బాహుబలి2 ఎనిమిది రోజుల్లో, దంగల్ 10వ రోజు ఇంకా టైగర్ జిందా హై పదో రోజు చేరాయి. ఇక యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన సినిమా ఇది. హీరో షారుక్ ఖాన్‌ , హీరోయిన్‌ దీపికా పదుకొణె, జాన్‌ అబ్రహం నటనకు, యాక్షన్‌ సీక్వెన్స్‌కు ప్రేక్షకులంతా కూడా ఎంతగానో ఫిదా అవుతున్నారు. విడుదలైన మొదటి రోజే రూ. 106 కోట్లు సాధించి బాలీవుడ్‌లో సరికొత్త రికార్డుని సృష్టించింది. అప్పటి నుంచి అదే జోరు కొనసాగిస్తోంది. 32 ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో హౌజ్‌ఫుల్‌ బోర్డు పెట్టడం ఈ సినిమాతోనే సాధ్యమైందని అక్కడి ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌ టీం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: