రోజాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్..!?

Anilkumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రామ్ చరణ్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలా అగ్రేసివ్ గా ఉండేవాడు. అచ్చం పవన్ కళ్యాణ్ లాగా అన్నమాట. కానీ పెళ్లయిన అనంతరం రామ్ చరణ్ చాలా మారాడు. రామ్ చరణ్ సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటాడు. ఆస్పద వ్యాఖ్యలు కూడా చేయడు. అయితే తాజాగా రోజా మెగాస్టార్ చిరంజీవి నాగబాబు మరియు పవన్ కళ్యాణ్ ల గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే రోజా మెగా బ్రదర్స్ కి ప్రజాదరణ లేదు అన్నట్లుగా మాట్లాడింది. 

అందుకే సొంత జిల్లాలోని పోటీ చేసి ఓడిపోయారు అని.. రాజకీయాలకు మెగా ఫ్యామిలీ పనికిరాదు అని.. ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి పెళ్లికి కూడా బిచ్చం వేయడు అని.. మెగా ఫ్యామిలీ పై దారుణమైన కామెంట్లను చేసింది రోజా. అయితే ఈ విషయాలపై చిరు కూడా పెద్దగా స్పందించలేదు. అయితే తాజాగా నిన్న జరిగిన వాల్తేరు వీరయ్య సినిమా విజయోత్సవ సభకు గెస్ట్గా వచ్చాడు రామ్ చరణ్ .ఇందులో భాగంగానే పరోక్షంగా రోజాకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే రామ్ చరణ్ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య సినిమా చూస్తున్నంత సేపు చాలా ఎంజాయ్ చేశాను అని.. ఈ సినిమాని చాలా శ్రద్ధగా నిర్మించారు అని..

డైరెక్టర్ బాబి ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు చాలా బాగా రాసుకున్నాడు అని..ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ చాలా అద్భుతంగా వచ్చిందని.. రవితేజ గారిని ఇలా చూడడం చాలా ఆనందంగా అనిపించింది అని.. ఈ కిక్ సరిపోక రవితేజ గారి ధమాకా సినిమా కూడా చూశాను అని.. నాన్నగారికి తన తమ్ముడు అంటే ఎంత ఇష్టమో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాడు అని.. చెప్పుకొచ్చాడు. అంతేకాదు స్టేషన్లో రవితేజ గారు ఫేస్ లిఫ్ట్ టర్నింగ్ తీసుకోండి బాక్స్ బద్దలై పోద్ది వంటి డైలాగులను తమ్ముడు చెప్పాడు కాబట్టి చిరంజీవి గారు ఊరుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.. తన తమ్ముడు గురించి ఎవరైనా ఏమైనా అనాలి అంటే అది మెగా ఫ్యామిలీ అండ్ మెగా ఫాన్స్ మాత్రమే అయ్యుండాలి వేరే ఎవరు అనడానికి వీలు లేదు.. చిరంజీవి గారు సైలెంట్ గా ఉన్నారేమో ..ఆయన వెనుక మేమున్నాం. కానీ మేము మాత్రం సైలెంట్ గా ఉండం.. సైలెంట్ గానే ఈ  మాట చెబుతున్నామ్.. అంటే అర్థం చేసుకోండి మేము అసలు సైలెంట్ గా ఉండము అంటూ ఇన్ డైరెక్ట్ గా రోజా కి వార్నింగ్ ఇచ్చాడు రామ్ చరణ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: