పఠాన్ హిట్ : తరువాత సినిమాలపై బోలెడు అంచనాలు?

Purushottham Vinay
10 ఏళ్ల తరువాత 'పఠాన్' తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. 10 సంవత్సరాలు మినిమమ్ యావరేజ్ హిట్ కూడా  లేకుండా ఫ్యాన్స్ ను వెయిటింగ్ లో పెట్టిన షారుఖ్ ఖాన్ ఫైనల్ గా సింహం లాగా 4 ఏళ్ళు గ్యాప్ తీసుకొని బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.ఇక ఈ సినిమా ఫస్ట్ డే నుంచే రికార్డు వసూళ్లు రాబడుతుంది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా 400 కోట్లను క్రాస్ చేసి షారుఖ్ సత్తా ఏంటో మరో సారి నిరూపించింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ తో బాలీవుడ్ ఫ్యూచర్ పై ఏర్పడిన సందేహాలు అన్నీ కూడా దెబ్బకు పటాపంచలయ్యాయి. పఠాన్ మూవీతో కింగ్ ఖాన్ ఇంత స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చినందుకు ఆయన ఫ్యాన్స్ బాగా పండగ చేసుకుంటున్నారు.దీంతో షారుక్ చేయబోయే తరువాతి మూవీస్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిపోయింది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'జవాన్'. తమిళ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. దీపికా పదుకొణే క్యామియో అపీరెన్స్ ఇవ్వనున్నట్టు సమాచారం తెలుస్తుంది.


ఈ సినిమాను ఈ సంవత్సరం జూన్ 2 వ తేదీన రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. షారుఖ్ ఖాన్ తో పాటు అట్లీ డైరెక్టర్ కావడం ఇంకా షారుఖ్ తిరిగి సూపర్ ఫామ్ లోకి రావడంతో ఈ పాన్ ఇండియా సినిమాపై కూడా ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి.అలాగే బాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఫస్ట్ టైమ్ షారుఖ్ తో సినిమా తీస్తున్నాడు. ఢంకీ అనే వెరైటీ టైటిల్ తో ఈ సినిమాని అనౌన్స్ చేసి ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు. ఢంకీ సినిమా ఈ సంవత్సరం డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టు  ప్రకటించారు. మున్నాభాయ్ సిరీస్, 3 ఇడియట్స్, పీకే ఇంకా సంజు లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇప్పుడు పఠాన్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ తో మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో మల్టీ లాంగ్వేజెస్ లో విడుదల కాబోతోంది. మొత్తానికి పఠాన్ బ్లాక్ బస్టర్ తో తాను హిట్ ట్రాక్ లోకి రావడమే కాకుండా బాలీవుడ్ కి మళ్ళీ ఊపిరి పోశాడు షారుక్ ఖాన్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: