2023లో నెంబర్ వన్ రికార్డ్ సృష్టించిన షారుఖ్ ఖాన్..!!

Divya
బాలీవుడ్ లో గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువగా సక్సెస్ రేటింగ్ తక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఎన్నో సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. తాజాగా షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం లో వచ్చిన పఠాన్ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైయింది.నాలుగేళ్ల తర్వాత షారుక్ ఖాన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో మొదటి రోజు నుంచి ఈ సినిమాకు భారీగా స్పందన వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో స్పై కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేలా చేసింది.

ఎట్టకేలకు ఈ సినిమాతో బాలీవుడ్ లో కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనే నటించింది. ఇక ఈమె అందచందాలతో కుర్రకారులను సైతం థియేటర్లకు రప్పించేలా చేస్తోందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో నటించిన నటీనటులు సైతం ఎవరికి వారు తమ పర్ఫామెన్స్ తో ఇరగదీసారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ మరింత పెరగడం గమనార్హం. ఈ సినిమా కలెక్షన్ పరంగా చూసుకుంటే బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్స్ క్రియేట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రానికి 4 ప్లస్ రేటింగ్ ఇవ్వడంతో పాటు ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని మొదటి మూడు రోజుల్లో ఏకంగా ఈ సినిమా రూ.313 కోట్ల రూపాయల గ్రాస్ వస్తువులను రాబట్టినట్లు తెలుస్తోంది. ఏడాది ఆరంభంలోని విడుదలైన సినిమాలలో ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు చేసిన చిత్రాల జాబితాలలో పఠాన్ చిత్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇక తర్వాత స్థానం వరిసు రూ .82 కోట్లతో నిలువగా తునీవు రూ .52 కోట్లను రాబట్టింది. ఇక తర్వాత వాల్తేర్ వీరయ్య రూ.28 కోట్ల క్రాస్ వీరసింహారెడ్డి రూ.15 కోట్ల క్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: