నెపోటిజం పై సంచలన వ్యాఖ్యలు చేసిన శృతిహాసన్...!!

murali krishna
లోక నాయకుడు అయిన కమల్ హాసన్ కుమార్తెగా శృతి హాసన్ చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. తాను హీరోయిన్ గా కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.తాను నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచాయి.ఇలా శృతిహాసన్ నటించిన సినిమాలన్నీ కూడా ప్లాప్ కావడంతో కెరియర్ మొదట్లో ఈమెను ఐరన్ లెగ్ అంటూ తెగ ట్రోల్ చేశారు. అలాంటి ట్రోల్స్ ఎదుర్కొన్న గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత రేసుగుర్రం, ఎవడు మరియు శ్రీమంతుడు వంటి వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.

 వరుస సినిమాలలో నటిస్తున్న శృతిహాసన్ తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు చిత్ర పరిశ్రమకి దూరంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమ కు దూరమైనటువంటి శృతిహాసన్ రవితేజ హీరోగా గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమా ద్వారా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు.ఇలా ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న శృతిహాసన్ చిరంజీవి బాలకృష్ణ సినిమాలలో నటించే అవకాశాలను కూడా అందుకున్నారు. ఇక ఈ రెండు సినిమాల్లో కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం శృతిహాసన్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

 ప్రభాస్ శృతి మొదటి సారి నటిస్తుంది. ఈ సినిమా ద్వారా ఈమె పాన్ ఇండియా హీరోయిన్ కాబోతుంది.ప్రస్తుతం ఈ సినిమా ఎంతో వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈరోజు శృతి హాసన్ పుట్టినరోజు కావున చిత్ర పరిశ్రమలో ప్రముఖులు తనకు విషెస్ చెప్పారు.పుట్టినరోజు సందర్భంగా శృతిహాసన్ చేసినటువంటి పోస్ట్ కూడా వైరల్ గా మారింది. ఈ సందర్భంగా శృతిహాసన్ నెపోటిజం గురించి షాకింగ్ పోస్ట్ ను అయితే చేశారు.తన తండ్రి గొప్ప నటుడు కావడంతో ఈమె కూడా స్టార్ హీరోయిన్ అవుతుంది అంటూ గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తల పై ఈమె స్పందిస్తూ తండ్రి గొప్ప నటుడు కానీ అలాంటి స్టార్ హోదా మనకు అంత ఈజీ గా రాదు ఆ హోదా అనుభవించడం కోసం చాలా కష్టపడాలి అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: