రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన త్రిష..!

Divya
కోలీవుడ్ ముద్దుగుమ్మ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇదిలా ఉండగా ఇది వరకే వెటర్నన్ హీరోలు మురళీమోహన్ , శోభన్ బాబు తదితరులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ భారీగా ఆస్తులను పోగు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హీరోయిన్లు కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని తపన పడుతూనే.. అందుకు తగ్గట్టుగా సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతూ మరింతగా ధనవంతులు అవుతున్నారు. అయితే ఈ లిస్టులో స్నేహ ముందంజలో ఉంటే.. ఇప్పుడు తాజాగా త్రిష కూడా చేరిపోయింది
ఇప్పటికే త్రిష నందనం అనే ఒక బిల్డింగ్ ను సొంతం చేసుకోగా.. ఇప్పుడు హైదరాబాదులో కూడా ఒక ఇల్లు కొనుక్కున్నట్టు తెలుస్తోంది. గత వారం కూడా చెన్నై సమీపంలో నిర్మాణంలో ఉన్న 50 ఎకరాల ఫామ్ హౌస్ ని కూడా కొనుగోలు చేసింది. ఈ హౌస్ లో అత్యాధునిక సౌకర్యాలు కూడా ఉన్నాయట. ఇకపోతే ఇంతటితో త్రిష ఊరుకోకుండా అల్వార్ పేట సమీపంలోని ఒక బిల్డింగ్ను కూడా కొనడానికి సిద్ధపడిందని సమాచారం. ముఖ్యంగా 26 ఏళ్ల వయసులోనే కోట్ల రూపాయల విలువ గల ఆస్తులను భూముల రూపంలో సొంతం చేసుకోవడానికి ప్రణాళికలు చేసిందని అందుకు తగ్గట్టుగానే ముందుకు వెళుతుందని కూడా సమాచారం. ప్రస్తుతం ఈమెకు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో మంచి పాపులారిటీ దక్కడంతో ఇప్పుడు వరుస సినిమాలలో అవకాశాలు లభిస్తున్నాయి.
ఈ క్రమంలోనే సినిమాలలో భారీ పారితోషకం తీసుకొని అక్కడ వచ్చిన డబ్బుతో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టి ఆస్తులను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ప్రముఖ ప్రైవేటు కంపెనీతో చేతులు కలిపి విల్లాలను విక్రయిస్తోంది అని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏదిఏమైనా త్రిష ముందు జాగ్రత్త కు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: