గజినీ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా...?

murali krishna
టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ ఆసిన్ గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు. ఆసిన్ తెలుగు లో టాలెంట్ ఉన్న హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది.

ఆసిన్  రవితేజ నటించిన అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో తెలుగు పరిశ్రమకి పరిచయం అయింది. తొలి సినిమాతో నే ఆమె మంచి గుర్తింపు ఏర్పరచుకుంది.ఆ తరువాత వరుసగా తెలుగు లో అవకాశాలను అందుకుని వరుస సినిమాలలో నటించింది.. తెలుగులో గజిని,శివమణి, ఘర్షణ,లక్ష్మి మరియు చక్రం వంటి సినిమాలలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.

అతి తక్కువ కాలంలోనే వరుసగా సినిమా అవకాశాలు అందుకోవడంతో పాటుగా తెలుగు ప్రేక్షకులకు  ఆమె దగ్గరయింది.తెలుగు తో పాటు తమిళ హిందీ భాషల్లో కూడా నటించి మంచి క్రేజ్ ని ఏర్పరచుకుంది. కెరిర్ బాగా ఉన్న సమయంలో ఈమె మైక్రో మ్యాక్స్ అధినేత అయిన రాహుల్ శర్మను  వివాహం చేసుకుంది.పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికింది... అయితే ఆసిన్ సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కూడా సోషల్ మీడియా లో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ అభిమానుల తో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది.

తన భర్తకు తనకు సంబంధించిన ఫోటోల ను అలాగే వీడియోల ను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆసిన్ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా లేదు.గత ఏడాది తన పాప ఆరిన్ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఒక పోస్ట్ ను షేర్ చేసింది. అంతే ఇంక ఊసే లేదు. హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఆసిన్ ఇప్పటి కీ కూడా అదే అందాన్ని కొనసాగిస్తుంది. ఆసిన్ కూడా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని ఆమె అభిమానులు ఎంతగానో ఆశిస్తున్నారు.మరీ చూడాలి ఆసిన్ మళ్ళీ సినిమాలలో నటిస్తుందో లేదో...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: