ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఈసారైనా హిట్ కొట్టగలడా....!!

murali krishna
ఏ సినీ ఇండస్ట్రీ ఐనా సరే సినిమా తీయడం తర్వాత దాన్ని రిలీజ్ చేయడం తర్వాత అది హిట్ ఐతే ఆనందం ఒకవేళ డిసస్టర్ ఐతే అపుడు ఆ ప్రొడ్యూసర్ పడే బాధ వర్ణతీతం. అలాగే ఎన్నో ఎక్సపెక్టేషన్స్ చేసిన మువీ డిజాస్టర్ అయితే ఆ డైరెక్టర్ ,లేదా హీరో కొంతకాలం ల్యాగ్ అవ్వడం ఖాయం.అదే స్టార్‌ డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌విషయంలో జరిగింది. ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్‌తో చేసిన దర్బార్‌ మూవీ ఆయనను తీవ్రంగా నిరాశపరచింది. దీంతో ఆయనకు ఆఫర్స్  తగ్గిపోయాయి. దాని ఎఫెక్ట్ వల్ల ఆయన కూడా కంప్లీట్ గా నమ్మకం కలిగాకే మూవీ మొదలెడదామని కొంచం గ్యాప్ తీసుకున్నారు. ఐతే ఈ మధ్య విజయ్‌ హీరోగా సినిమా చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే విజయ్‌ ఆయనకు చాన్స్‌ ఇవ్వలేదు. అలాగే తెలుగులో ఒకరిద్దరు హీరోలతో మూవీస్ చేయన్నట్లు ఊహాగానాలు వచ్చాయి కానీ ఇవి కూడా ముందుకు వెళ్లలేదు.
ఐతే మురుగదాస్‌ నెక్స్ట్ చిత్రం ఏమిటనేది ఒక ప్రశ్నర్ధకంగా సినీ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐతే ఇటువంటి  పరిస్థితుల్లో లేటెస్ట్ గా ఈయన బాలీవుడ్‌లో ఇద్దరు స్టార్‌ హీరోలతో మూవీ చేయబోతున్నట్లు వచ్చాయి.  సల్మాన్‌ఖాన్, షారూక్‌ఖాన్‌ హీరోలుగా హిందీలో మల్టీస్టార్‌ మూవీ ని తీయబోతున్నారని ప్రచారం జరిగింది.వారిద్దరూ ఒకప్పుడు కరణ్ అర్జున్ చిత్రం లో చేసారు తర్వాత కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రలో మెరిశారు. ఐతే కంప్లీట్ గా ఒక్క మూవీ కూడా చేయలేదు.కనుక ఇపుడు  మురుగదాస్‌ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. ఐతే ఆ ఇంకా  ముందుకు వెళ్లలేదు. ఈ ప్రాసెస్ లో శివ కార్తికేయన్ హీరోగా ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ యిందని తెలుస్తుంది.
ఈ మూవీ ను లైట్‌ హౌస్‌ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో తీస్తున్నారు అని కూడా తెలుస్తోంది. ఈ మూవీ పై త్వరలో ఒక ఆఫీషల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.ఐతే శివకార్తికేయన్ ప్రెసెంట్  ‘అయిలాన్‌‘ మూవీని కంప్లీట్ చేసి ‘మావీరన్‌‘ అనే మూవీ లో నటిస్తున్నాడు .
ఐతే మురగదాస్ తన కెరీర్ లో ఎన్నో గొప్ప మూవీస్ లను తీశారు. అందులో ముఖ్యంగా  ‘దీనా’, ‘గజిని’, ‘తుపాకి’, ‘కత్తి’ లాంటి మూవీస్ భారీ వసూళ్లను రాబట్ట్యాయి. సూర్యతో ‘గజిని’ సినిమా ని చేసిన మురుగదాస్, అదే మూవీ ను హిందీలో అమీర్ ఖాన్ తో రీమేక్ చేశారు.అక్కడ కూడా అది సూపర్ హిట్ అయ్యింది.దళపతి విజయ్ తో ‘తుపాకి’ మూవీ తీసి మళ్ళీ అదే మూవీ ని హిందీలో అక్షయ్ కుమార్ తో ‘హాలిడే’గా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఏమైందో తెలీదు కానీ ఆ తర్వాత నుండి మురుగదాస్ చెప్పుకొదగ్గ హిట్ ఏమి పడలేదు.                 శివకార్తికేయన్ మూవీతో ఐనా సరే మళ్ళా ఆయన హిట్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: