మహేష్ కోసం అదిరిపోయే ప్లాన్ చేసిన త్రివిక్రమ్..!?

Anilkumar
త్వరలోనే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడని తెలుస్తోంది. ముందుగా త్రివిక్రమ్ ఈ సినిమా కథని మహేష్ కి వినిపించిన అనంతరం ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో వద్దు అని చెప్పాడట. కానీ మహేష్ బాబుని ఒప్పించి ఈ సినిమాని నేషనల్ లెవెల్ ఆడియన్స్ కు చేరవేసేలా ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. ఇందులో భాగంగానే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎస్ ఎస్ ఎం బి 28 సినిమాలో మరో స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇక అదేంటంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక కొత్త మేనరిజం చూపించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో భాగంగా హీరో క్యారెక్టర్జేషన్ కి ఒక కొత్త మేనరిజం ఉంటుందని తెలుస్తోంది. ఇక అది చాలా కొత్తగా ఉంటుందని మహేష్ అలా చేయడంతో ఒక స్పెషల్ గ్రేస్ వస్తుంది అని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోలో సినిమాల్లో కొన్ని మేనరిజాలో వారి ఫాన్స్ ని చాలా ఆకట్టుకుంటున్నాయి అని చెప్పాలి. ఇంతకుముందు మహేష్ బాబు తన సినిమాల్లో మేనరిజం చూపించాడు. కానీ క్యారెక్టర్ కి మాత్రం ఇప్పటిదాకా చేయలేదు. ఇందులో భాగంగానే తాజాగా త్రివిక్రమ్ ఈ సినిమాలో హీరో పాత్రకి ఒక కొత్త మేనరిజం ని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక అది సినిమా మొత్తానికి చాలా ప్లస్ అవుతుంది అని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి ఇది కచ్చితంగా నచ్చుతుంది అని అంటున్నారు. మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా అనంతరం కొద్దిగా గ్యాప్ తర్వాత ఈ సినిమాని త్రివిక్రమ్ తో మొదలుపెట్టాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ కూడా మొదలైంది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని భావించినప్పటికీ ఇప్పుడు మాత్రం జూన్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా పూజ హెగ్డే మరియు శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: