చిరంజీవి కెరీర్లో 100 కోట్ల షేర్ కలెక్షన్లను అందుకున్న మూవీలు అవే..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలలో నటించి ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బాస్టర్ మూవీలలో కొన్ని మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లను అందుకున్నాయి. అలా చిరంజీవి కెరీర్ లో 100 కోట్లకు పైగా షేర్ కలక్షన్లను అందుకున్న సినిమాలు 3 ఉన్నాయి. ఆ 3 సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం.
చిరంజీవి తాజాగా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జనవరి 13 వ తేదీన విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటించగా , మైత్రి సంస్థ ఈ మూవీని నిర్మించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది.
చిరంజీవి ,  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన సైరా నరసింహారెడ్డి అనే పాన్ ఇండియా మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నయనతార , తమన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా షేర్ కలక్షన్లను వసూలు చేసింది.
చాలా సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి కొంతకాలం క్రితం వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఖైదీ నెంబర్ 150 మూవీతో తిరిగి సినిమాల్లోకి రీ  ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ అయినటువంటి ఖైదీ నెంబర్ 150 లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా , దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా షేర్ కలక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: