ప్రేమిస్తే సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
2004లో విడుదలైన ప్రేమిస్తే సినిమా అందరికీ గుర్తుంటే ఉంటుంది. అప్పట్లో ఈ సినిమా విడుదలై ఎంతటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా అప్పట్లో నిజజీవితం ఆధారంగా తెర్కెక్కింది. ఇక ఈ విషాద ప్రేమ కథకు ఇప్పటికీ ఫాన్స్ ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా బాలాజీ శక్తి వెల్ దర్శకత్వంలో వచ్చింది. కాగా ఈ సినిమాలో ట్రెండ్ సెట్టర్ లవ్ స్టోరీలలో భరత్ మరియు సంధ్య నటించడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సంధ్యకు ఇదే మొదటి సినిమా. 

ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపును పొందింది ఈమె. ఈ సినిమా అనంతరం తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో కూడా అవకాశాలు రావడం జరిగింది. అన్ని భాషల్లో కలుపుకొని సంధ్యా సుమారు 90 కి పైగా నీ సినిమాలలో నటించింది. అనంతరం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అన్నవరం సినిమాలో పవన్ కి చెల్లెలి పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది. వరలక్ష్మి అని అమాయకపు చెల్లెలి పాత్రలో నాచురల్ గా నటించి ఎందరినో మెప్పించింది ఈమె. వరుస సినిమాలతో సక్సెస్ను అందుకున్నప్పటికీ ఆ సక్సెస్ను కొనసాగించలేకపోయింది సంధ్య. 

అనంతరం ఇండస్ట్రీకి దూరమైంది. 2015లో చెన్నైకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. చాలా సింపుల్గా ప్రేమ వివాహం చేసుకుంది ఈమె. ఇండస్ట్రీకి దూరమైన అనంతరం సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా లేదు సంధ్య. 2016లో ఈ దంపతులకు ఒక పండంటి ఆడబిడ్డ పుట్టింది. ప్రస్తుతం ఈమె తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలోనే ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ ను ప్రస్తుతం ఎంజాయ్ చేస్తుంది ఈమె. ఇదిలా ఉంటే తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది ఈ తార. ఇందులో భాగంగానే కోలీవుడ్ కి చెందిన ప్రముఖ దర్శకుడు సినిమాలో హీరోయిన్ అక్క పాత్రలో చేసేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: