హీరోయిన్ శృతిహాసన్ కు ఆ యంగ్ హీరో షాక్ ?

VAMSI
టాలీవుడ్ సినిమా పరిశ్రమకు సంక్రాంతి అన్నది ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతిని నమ్ముకుని భారీగా అవసూలుకాను రాబట్టుకోవడానికి కొన్ని నెలల ముందు నుండే పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగుతుంటారు దర్శక నిర్మాతలు. అలా ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ఒకటి మెగాస్టార్ చిరంజీవి మరియు డైరెక్టర్ బాబీ కాంబోలో వచ్చిన "వాల్తేరు వీరయ్య". ఇందులో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని వసూళ్లలో దూసుసుకుపోతోంది.
ఇక మరో సినిమా నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించిన "వీరసింహారెడ్డి"... ఈ సినిమాను మాస్ చిత్రాలను చక్కగా ప్రెజెంట్ చేయడంలో నైపుణ్యాన్ని సంపాదించిన డైరెక్టర్ మలినేని గోపిచంద్ మరోసారి తన మార్క్ ను కనబరిచాడు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మరియు డైరెక్షన్ విషయాల్లో ఎక్కడా పొరపాటు లేకుండా అన్ని విభాగాలను లైన్ చేసుకుంటూ సంక్రాంతికి బాలయ్య ఫ్యాన్స్ ను నిరాశపరచకుండా హిట్ ను సాధించాడు. అయితే ఈ సినిమాలో కూడా బాలయ్యకు జతగా శృతిహాసన్ నటించడం విశేషం. ఇలా ఏకకాలంలో తాను నటించిన రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వడం మరియు రెండూ హిట్ అవ్వడం తనకు బాగా కలిసొచ్చింది అని చెప్పాలి.
అయితే ఈ రెండు సినిమాలలోనూ తన పాత్రకు తగిన ప్రాధాన్యత లేకపోవడం మరియు ప్రమోషన్ కార్యక్రమాలకు ఈమె హాజరు కాకపోవడం వంటి కొన్ని కారణాల వలన శృతి హాసన్ ను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా శృతిహాసన్ సీనియర్ హీరోలతో సినిమా చేయడం వలన ప్రేక్షకులకు వయసు ఎక్కువ కనిపిస్తుండడం, అందుకే ఒక సువర్ణావకాశం కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఒక యంగ్ హీరోతో సినిమా కోసం శృతి హాసన్ ను ఫైనల్ చేశారట. అయితే ఇప్పుడు ఆ హీరో శృతి హాసన్ నా సినిమాలో వద్దు కాన్సుల్ చేయండి అని నిర్మాత దగ్గర డిమాండ్ చేస్తున్నాడట. ఇక ముందు ముందు శృతి హాసన్ సీనియర్ హీరోలతో సినిమాలు చేయాల్సిందేనా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: