కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ ఆఫర్ ను దక్కించుకున్న సునీల్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కెరియర్ ప్రారంభంలో కమీడియన్ గా అద్భుతమైన గుర్తింపును తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోగా నటించి , ఆ మూవీలతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంతో హీరోగా కొన్ని సంవత్సరాల పాటు సునీల్ కెరియర్ను కొనసాగించాడు. కాకపోతే సునీల్ కు  హీరోగా భారీ విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. దానితో సునీల్ మళ్లీ తిరిగి కమెడియన్ పాత్రలలోనూ ... ఇతర ముఖ్య పాత్రలలోనూ నటిస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా కొంతకాలం క్రితమే సునీల్ ... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఈ మూవీలో సునీల్ పాత్ర అద్భుతంగా ఉండడంతో ఇండియా వ్యాప్తంగా సునీల్ కు ఈ మూవీ ద్వారా మంచి క్రేజ్ లభించింది. దానితో ప్రస్తుతం సునీల్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మాత్రమే కాకుండా ఇతర సినిమా ఇండస్ట్రీ ల నుండి కూడా భారీ క్రేజీ సినిమా ఆఫర్ లు లభిస్తున్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి సునీల్ కు క్రేజీ సినిమా అవకాశాలు లభిస్తున్నాయి.
 

అందులో భాగంగా ఇప్పటికే సునీల్ కు రజనీ కాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ మూవీ లో అవకాశం లభించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విశాల్ "మార్క్ ఆంటోనీ" అనే మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో సునీల్ మేజర్ రోల్ లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: