ప్రభాస్ నెక్స్ట్ మూవీల విడుదల తేదీలు ఇవే..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ కొంత కాలం క్రితం రాదే శ్యామ్ అనే ప్రేమ కథ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి రాధా కృష్ణ దర్శకత్వం వహించగా , పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా యు వి సంస్థ వారు నిర్మించారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే సారి విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల ఈ మూవీ ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ కొంత కాలం క్రితమే ప్రభాస్ "ఆది పురుష్" మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని 16 జూన్ 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ తో పాటు ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 28 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ రెండు మూవీలతో పాటు మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అని ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రభాస్ మరికొన్ని రోజుల్లో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: