శాకుంతలం సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్..!!
అయితే ఈ సినిమాను గతంలో విడుదల చేయాలని చిత్ర బృందం భావించిన పలు కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఇప్పటికే విడుదల తేదీని లాక్ చేసిన చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాలలో ఒక వార్త వైరల్ గా మారుతోంది. శాకుంతలం సినిమా ఇంకా విడుదల కాకముందే.. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటి దిగ్గజ సంస్ధ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో దేవ్ మోహన్ హీరోగా నటిస్తూ ఉన్నారు. భారీ క్యాస్టింగ్ తో ఈ సినిమానీ డైరెక్టర్ గుణశేఖర్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో ట్రైలర్లు చూస్తే మనకు క్లియర్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా బాహుబలి ని తలపించే విధంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాతో సమంత కం బ్యాక్ ఇవ్వడం ఖాయం అంటూ కూడా పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం సమంత ఖుషి సినిమాలో కూడా నటిస్తోంది.