రెండు తెలుగు రాష్ట్రాల్లో వారసుడు మూవీకి వారం రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ తాజాగా వారిసు అనే మూవీ లో హీరోగా నటించాడు. వంశీ పైడిపల్లి ఈ మూ వీకి దర్శకత్వం వహించగా , దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా , తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని జనవరి 11 వ తేదీన తమిళ్ లో విడుదల చేయగా , జనవరి 14 వ తేదీన వారసుడు అనే టైటిల్ తో తెలుగులో విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు వర్షన్ ఇప్పటికే వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ వారం రోజుల్లో ఈ సినిమా రోజు వారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం.


ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.10 కోట్ల కలెక్షన్లను వసులు చేయగా ,  రెండవ రోజు 2.94 కోట్ల కనెక్షన్ లను వసూలు చేసింది. మూడవ రోజు ఈ సినిమా 2.69 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా ,  నాలుగో రోజు 2.17 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఐదవ రోజు ఈ సినిమా 1.30 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా  ఆరవ రోజు 0.63 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఏడవ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 0.24  కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తం మీద ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 13.07 కోట్ల షేర్ , 23.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను చేసింది. ప్రస్తుతం కూడా వారసుడు మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తమిళ్ వర్షన్ కు మాత్రం ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో శ్రీకాంత్ ,  విజయ్ కి తమ్ముడు పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: