శృతిహాసన్ విషయంలో క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ !

Seetha Sailaja
శ్రీమంతుడు’ మూవీ సూపర్ హిట్ తరువాత శృతిహాసన్ తన కెరియర్ పై దృష్టిపెట్టి ఉంటే ఈపాటికే ఆమె దక్షిణాదిలో నెంబర్ వన్ హీరోయిన్ అయి ఉండేది. ఆమూవీ విడుదల తరువాత ఆమె పీకలలోతు ప్రేమలో పడటంతో ఆమె సినిమాల కంటే తన ప్రేమ పైనే ఎక్కువ దృష్టిపెట్టింది.
 
 
 ఆ ప్రేమ పూర్తిగా తగ్గిపోయి బ్రేకప్ వరకు వెళ్ళిన తరువాత యూటర్న్ తీసుకుని తిరిగి సినిమాల వైపు దృష్టిపెట్టిన సమయంలో గోపీచంద్ మలినేని ‘క్రాక్’ మూవీ ఆఫర్ కు ఆమె ఓకె చేయడం ఆతరువాత ఆమూవీ హిట్ కావడంతో తిరిగి ఆమె కెరియర్ ట్రాక్ లో పడింది. ఆసినిమా తరువాత వెంటనే మళ్ళీ గోపీచంద్ బాలకృష్ణతో తీసిన ‘వీరసింహారెడ్డి’ మూవీలో ఆమె హీరోయిన్ గా ఎంపిక కావడంతో పాటు సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేర్ వీరయ్య’ లో కూడ శృతి హీరోయిన్ కావడంతో సంక్రాంతి సినిమాల హీరోయిన్ గా మారిపోయింది.
 
 ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో గోపీచంద్ శృతిహాసన్ గురించి మాట్లాడుతూ ‘ఐ లవ్ యు’ చెప్పడం ఆతరువాత వెంటనే శృతి తనకు ఇండస్ట్రీలో ఒక అన్నయ్య ఉన్నాడు అంటూ గోపీచంద్ వైపు చూడటంతో ఆవిషయం అక్కడితో ముగిసిపోయింది. అయితే ఈవిషయాన్ని లోతుగా ఆలోచిస్తూ సోషల్ మీడియాలో శృతిహాసన్ గోపీచంద్ ల సాన్నిహిత్యాన్ని టార్గెట్ చేస్తూ కొందరు నెగిటివ్ కామెంట్స్ మొదలుపెట్టారు.
 
ఈవిషయం గోపీచంద్ వరకు రావడంతో అతడు ఈవిషయం పై స్పందించాడు. శృతిహాసన్ తన కుటుంబ సభ్యురాలుగా ఉంటూ తనతో సోదర భావంతో ఉంటుందని కామెంట్ చేసాడు. ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడల్లా తన కొడుకు కోసం చాక్లెట్స్ టాయ్స్ తెచ్చి ఇస్తుందని అంతేకాకుండా తన భార్యతో సన్నిహితంగా ఉండే ఆమె పై ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో ఎందుకు చేస్తున్నారో తనకు అర్థంకావడంలేదు అంటూ కామెంట్స్ చేసాడు. ‘వాల్తేర్ వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ రెండు సినిమాలు హిట్ కావడంతో శృతిహాసన్ దశ తిరిగినట్లే అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: