టాప్ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తున్న సంక్రాంతి రిజల్ట్ !

Seetha Sailaja
కరోనా వేవ్ లు మొదలయ్యాక జనం ధియేటర్లకు రావడం తగ్గించి ఇంట్లో ఓటీటీ సినిమాలు చూస్తూ కాలం గడపడంతో మంచి కథతో ఉండే సినిమాలను మాత్రమే జనం చూస్తారు అన్న అంచనాలకు ఇండస్ట్రీ వర్గాలు వచ్చాయి. దీనికితోడు గత సంవత్సరం ఉదాత్తమైన కథలతో వచ్చిన ‘సీతారామం’ లాంటి సినిమాలు సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది అన్న అంచనాలకు హీరోలు నిర్మాతలు రావడంతో వారు తీసే సినిమాల కథల విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

అయితే డిసెంబర్ చివరి నుండి ప్రేక్షకుల అభిరుచిలో ఒకేసారి మళ్ళీ మార్పు వచ్చి వారంతా యూటర్న్ తీసుకుని మాస్ సినిమాలు చూడటం మళ్ళీ అలవాటు చేసుకుంటున్నారా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో ఉన్నాయి. దీనికికారణం పూర్తి రొటీన్ కధలతో వచ్చిన ‘ధమాక’ ‘వీరసింహారెడ్డి’ ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలు సాధించిన ఘన విజయం.

ఈమూడు సినిమాలకు రివ్యూలలో ఏవరేజ్ మార్క్ లు పడటమే కాకుండా ఈమూవీలు విడుదలైన మొదటిరోజున ఆమూవీలో నటించిన హీరోల అభిమానులకు తప్ప సగటు ప్రేక్షకులకు ఎవరికీ పెద్దగా నచ్చలేదు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ టాక్ తో సంబంధం లేకుండా ఈమూడు సినిమాలు 100 కోట్ల క్లబ్ లో అతి సులువుగా చేరిపోయి అందరికీ షాక్ ఇచ్చాయి.

దీనితో మళ్ళీ మాస్ సినిమాల హవా సినిమాలో హీరోల ఊచకోత మళ్ళీ మొదలైందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఓటీటీ ట్రెండ్ తో టాప్ హీరోలు తమకు కథలు వ్రాసే దర్శకులను రచయితలను కొంతమేరకు వాస్తవ దృష్టితో కథలు వ్రాయమని చెప్పారని అంటారు. అయితే ఇప్పుడు హీరోలు ఎలాంటి కష్టం లేకుండా ఒక ఆయుధంతో 100 మందిని నరికేస్తూ ఉంటే దానికి 100ల కోట్లు కలక్షన్స్ వస్తున్న పరిస్థితులలో ఈ ట్రెండ్ కు అనుగుణంగా తాము మళ్ళీ యూటర్న్ తీసుకోవాల అన్న అంతర్మధనంలో టాప్ హీరోలు ఉన్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: