డైరెక్టర్ బాబీ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్.. ఏంటో తెలుసా.. !?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రస్తుతం మెగాస్టార్ అభిమానులు గత కొంతకాలంగా  సరైన హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చిరంజీవి సినిమాలకి ఆయన ఎంత గ్యాప్ ఇచ్చినా కూడా ఆయన ఇమేజ్ కి తగ్గ సినిమాతో మళ్ళీ ఈ సినిమాతో హిట్టు కొట్టాడు చిరంజీవి. దాని అనంతరం మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా కూడా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయినప్పటికీ మెగా అభిమానులను ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

దాని అనంతరం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఎంతటి ఫ్లాప్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా అనంతరం గాడ్ ఫాదర్ సినిమా విడుదలైనప్పటికీ ఆ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.అలా వరుస సినిమాలు ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో ఈ సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ హిట్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి బాబి దర్శకత్వంలో వచ్చిన  వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. మొదట ఈ సినిమా విడుదలైన అనంతరం సినిమా బాలేదని కథ చాలా రొటీన్ గా ఉంది అన్న టాక్ వినిపించింది.అనంతరం నెమ్మదిగా ఈ సినిమా చూసేందుకు జనాలు ఎగబడ్డారు.

డైరెక్టర్ బాబి మెగాస్టార్ చిరంజీవిని ఈ సినిమాలో వీరయ్య గా చూపించడంతో ఆయన అభిమానులు జేజేలు సైతం పలికారు. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాకి పోటీగా ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. కానీ చిరంజీవి సినిమా అందుకున్న విజయాన్ని మరి ఏ సినిమా కూడా క్రాస్ చేయలేకపోయింది. రీ ఎంట్రీ అనంతరం మెగాస్టార్ చిరంజీవికి ముచ్చటగా మూడవసారి 100 కోట్ల రూపాయల షేర్ సినిమాని ఇచ్చారు. ఈ సినిమాతో చిరంజీవి ముఖంలో సంపూర్ణమైన ఆనందం కనిపించింది అంటూ మెగా అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ కార్యక్రమాలలో చిరంజీవి ముఖంలో ఎంత ఆనందం కనిపించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇచ్చినందుకు ఈ సినిమా డైరెక్టర్ బాబిని పొగడ్తలతో ముంచుతున్నారు మెగా అభిమానులు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా బాబిని తన ఇంటికి ఆహ్వానించి భోజనం ఇచ్చి విలువైన కారుని బాబీకి బహుమతిగా ఇచ్చాడని తెలుస్తుంది. ఇక ఆ కారు విలువ సుమారుగా రెండు కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: