బిగ్ బాస్ కి గుడ్ బై చెప్పిన సల్మాన్ ఖాన్.. ఆ ప్లేస్ లో వచ్చేది ఎవరంటే..!?

Anilkumar
బుల్లి తెరపై అత్యధిక రేటింగ్ ఉన్న షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ ఏ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అన్ని ఇండస్ట్రీలలో ఈ షో టెలికాస్ట్ అవుతుంది. అయితే ఈ షో ఇప్పటికే తెలుగులో 6 సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏడవ సీజన్ కి రెడీ అవుతుంది. అయితే ఈ షో బాలీవుడ్ లో గత కొన్ని సంవత్సరాలుగా రన్ అవుతుంది.హిందీలో బిగ్ బాస్ షో కి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 12 సీజన్లకు పైగానే సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించారు. ప్రస్తుతం 16వ సీజన్ కి కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 

తెలుగులో బిగ్ బాస్ ఒకటి రెండు సీజన్లో రాగానే ఆదరణ కోల్పోతుంది. కానీ హిందీలో మాత్రం 16 సీజన్లు కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ 16 సీజన్లకి కూడా మంచి రేటింగ్స్ వస్తున్నాయి.దీంతో ఈ షో ని మరికొన్ని రోజులు పొడిగించాలి అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వార్తకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ 16 సీజన్ నుండి సల్మాన్ ఖాన్ హోస్ట్గా తప్పుకున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారమే సల్మాన్ ఖాన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మొదట వారు అనుకున్న ఒప్పందం ప్రకారం ఎన్ని రోజులు ఈ సీజన్ చేయాలో అన్ని రోజులు హోస్ట్ గా చేశాడు సల్మాన్ ఖాన్. ఆయన ఒప్పందం మేరకు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడట. వచ్చేవారం నుండి సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ లో కనిపించడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. అయితే ఒకవేళ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హోస్ట్గా తప్పకుంటే కొత్తగా ఈ షో ని ఎవరు హోస్ట్ చేస్తారు అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. అయితే సల్మాన్ ఖాన్ కంటే ముందు బిగ్ బాస్ ఓటిటి సీజన్ కు కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సీజన్ కి కూడా కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: