మరో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు ఓకే చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఆది పురుష్, సలార్ ,ప్రాజెక్ట్ కె  వంటి సినిమాలతో పాటు మారుతి డైరెక్టర్ చేస్తున్న సినిమాలో సైతం నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ ఈ మూడు సినిమాల తర్వాత స్పిరిట్ సినిమాలో నటించనున్నాడు అని తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా పోలీస్ బాక్ డ్రాప్ లో ఉంటుందని ఈ సినిమా నిర్మాత భూషణ్ కుమార్ చెప్పడం జరిగింది.ఇకపోతే ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ సరికొత్తగా చూపించాలని భావిస్తున్నాడు. 

ప్రభాస్ ఇప్పటికే చాలా పాత్రలో కనిపించి మెప్పించాడు. కానీ ప్రభాస్ కెరియర్ లోనే మొట్టమొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ స్పీరిట్ ఇంకా  ప్రారంభం కాలేదు.ఈ నేపథ్యంలోని ఈ సినిమా ఇంకా పూర్తి కాకపోయినప్పటికీ మరో రెండు ప్రాజెక్టులకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రెండు ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టుని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుంది అని తెలుస్తోంది.

ఇకపోతే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. దీనికి సంబంధించిన ఈ విషయాన్ని ఇటీవల ఈ సినిమా నిర్మాత నవీన్ ఎర్నేని తాజాగా ఒక టీవీ షోలో చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే ఇక ప్రశాంత్ డైరెక్ట్ చేస్తున్న సలార్ షూటింగ్లో ఉన్నాడు ప్రభాస్. ఈ నేపథ్యంలోనే ఈ యంగ్ డైరెక్ట్ డైరెక్షన్ లోనే మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభాస్.ఇక ఈ సినిమాని దిల్ రాజు నిర్మించబోతున్నారు అని తెలుస్తుంది .ఇటీవల దిల్ రాజు రావడం అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుందని అధికారికంగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకే ప్రభాస్ చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక తాజాగా ఈ లిస్టులో మరో రెండు సినిమాలు కూడా చేరాయి అన్న వార్త విన్న ప్రభాస్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: