#NTR 30 లో ధమాకా హీరోయిన్ ఫిక్స్..!

Divya
తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో భారీ పాపులారిటీ అందుకున్న ఎన్టీఆర్ కేవలం పాన్ ఇండియా హీరో గానే కాకుండా ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే ఎన్టీఆర్ ఇంతటి భారీ చిత్రంతో వచ్చాడు. కాబట్టి ఆయన తన తదుపరిచిత్రం కూడా అదే రేంజ్ లో ఉండాలని అభిమానులు ఆశపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన తన తదుపరిచిత్రంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ కొట్టిన కొరటాల శివ ఇప్పుడు ఎన్టీఆర్ తో విజయాన్ని పొందుతాడనే నమ్మకం తమకు లేదు అంటూ తమ అభిప్రాయాలను వెల్లడించారు.
కానీ ఎట్టకేలకు కొరటాల శివకు చెప్పి.. స్క్రిప్ట్ పూర్తిగా మార్చేయాలని అప్పుడే తన సినిమాలో నటిస్తానని ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొరటాల శివ కూడా ఎన్టీఆర్ రేంజ్ కి తగ్గట్టుగా కథను తయారు చేశాడు అని.. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలబడలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ధమాకా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీ లీలా హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు సమాచారం.
పెళ్లి సందడి మూవీతో భారీ క్రేజ్ అందుకున్న ఈమె ఆ తర్వాత ఈమె నటించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే రవితేజతో ధమాకా సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అనిల్ రావిపూడి , బాలకృష్ణ కలిసి నటిస్తున్న సినిమాలో కూతురి పాత్రలో అవకాశాన్ని దక్కించుకోగా.. మరొకవైపు మహేష్ బాబు,  త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా ఎంపికైంది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: