మెగాస్టార్ చిరుకి.. జబర్దస్త్ కమెడియన్ సర్ ప్రైస్ గిఫ్ట్?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన ఇక ఇప్పుడు 60 ఏళ్లు దాటిపోతున్న తరగని క్రేజ్ తో కొనసాగుతున్నారు. యువహీరోలకు సైతం పోటీ ఇస్తున్నారు అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి ఇక ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఎంతోమంది యువ హీరోలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇక మెగాస్టార్ అంటే కేవలం ఒక సాదాసీదా హీరో కాదు మహా వృక్షం అనే రేంజ్ లో ఇక తన ఫ్యామిలీలో ఎంతోమందిని హీరోలు చేసి సరికొత్త లైఫ్ ప్రసాదించాడు అని చెప్పాలి.

 అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నది అటు మెగాస్టార్ చిరంజీవిని చూస్తే అర్థమవుతూ ఉంటుంది. మెగాస్టార్ క్రేజ్ పరంగా ఆకాశమంత ఎత్తు ఎదిగినప్పటికీ ఇంకా ఒక సాదాసీదా వ్యక్తి లాగానే కనిపిస్తూ అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఎప్పుడూ తన మంచితనంతో ప్రేక్షకులను ఫిదా చేసేస్తూ ఉంటాడు అని చెప్పాలి.  ఇకపోతే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ సాధించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా బుల్లితెరపై ప్రసారమవుతున్న సుమ అడ్డ అనే కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు మెగాస్టార్.

 అప్పుడప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న కమెడియన్స్ కి మెగాస్టార్ లాంటి ఒక వ్యక్తిని చూడటం అంటే ఇక ఒక పండగ లాంటిదే అని చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే సుమ అడ్డ కార్యక్రమం లో కమెడియన్ గా చేస్తున్న శ్రీ సత్య మెగాస్టార్ ను చూడగానే మైమరిచిపోయింది. ఈ క్రమంలోనే ఆయనతో కలిసి ఫోటో దిగడమే కాదు.. ఆయనకు ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చింది అని చెప్పాలి. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది జబర్దస్త్ కమెడియన్ శ్రీ సత్య. చిరు సినిమాల పేరుతో  అద్భుతమైన కవితలు రాసి ఉన్న ఫోటోని బహుమతిగా చిరంజీవికి అందించింది శ్రీ సత్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: