వారిసు మూవీ తో దిల్ రాజు సేఫ్ అయినట్టేనా..?

Divya
విజయ్ దళపతి గురించి మనం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం వారసుడు.  చాలా రోజుల తర్వాత విజయ్ నుంచి పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీలో వచ్చిన ఈ సినిమా కార్పొరేట్ బ్యాక్ డ్రాప్ లో ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో బంధాలు,  బాధ్యతలను గుర్తుచేస్తూ ఈ సినిమా కథను వంశీ పైడిపల్లి ఆవిష్కరించడం జరిగింది. కంటెంట్ పరంగా సినిమా బాగానే ఉన్నా ఈ జనరేషన్ లో చెప్పాల్సిన కథ కాదనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.  20 ఏళ్ల బ్యాక్ లో ఇలాంటి కథలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేవారు కానీ ప్రస్తుతం పబ్లిక్ అంతా మాస్ , యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్,  క్రైమ్ ఎలిమెంట్స్ ఉండే కథలను మాత్రమే ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతున్నారు.

ఈ కారణంగానే తెలుగులో వారసుడు సినిమాకి మొదటిరోజు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా తమిళ్ ప్రేక్షకులు ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ కి ఎక్కువగా కనెక్ట్ కాలేకపోవడమే గమనార్హం. సినిమాలో తమిళ్ యాక్టర్స్ ఉన్నా కూడా ఎమోషన్స్ అంతా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండడం వల్లే వారిసు సినిమాకి మూడు రోజుల్లో డివైడ్ టాక్  రావడానికి కారణం అయ్యింది మొదటి రోజు రూ.13.43 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజుకి 60% డ్రాప్ తో కేవలం రూ. 8.75 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. మూడవరోజు రూ.7.1 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.  ఇకపోతే ఓవరాల్ గా మూడు రోజుల్లో ఈ సినిమా రూ.35.29 కోట్ల కలెక్షన్ మాత్రమే వసూలు చేసింది.
అయితే ఈ సినిమా డిజాస్టర్ అయినా కూడా థియేట్రికల్ రైట్స్ ముందుగానే అమ్మేయడంతో దిల్ రాజు ఈ సినిమా నష్టాల నుంచి తప్పించుకున్నాడు అనే మాట ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది.  అయితే టాలీవుడ్ లో మాత్రం వారసుడు నష్టాన్ని కచ్చితంగా దిల్ రాజ్ భరించ్చాల్సిందే అన్న వార్త కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇలా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం నిజంగా విషాదకరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: