వీరసింహారెడ్డి: ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా వీరసింహారెడ్డి. సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఈ జనవరి 12 వ తేదీన చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ హాట్ బ్యూటీ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది.ఇంకా అలాగే మలయాళీ హాట్ బ్యూటీ అయిన హనీ రోజ్ ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని ఇంకా వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో చాలా భారీగా నిర్మించారు. ఇక ఇప్పటికే విడుదలైన వీరసింహారెడ్డి ట్రైలర్ అయితే సెన్సేషనల్ హిట్ అయ్యింది. అలాగే ఈ మూవీ ఆల్బమ్ కూడా పెద్ద చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. జై బాలయ్య, సుగుణ సుందరి ఇంకా మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు అయితే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యి ఎంతగానో అలరించాయి.


ఇక ఈ సినిమా మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ చేసుకుంది. అన్ని ఏరియాలనుంచి వీరసింహారెడ్డి సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది.అందుకు తగ్గట్టే వీరసింహారెడ్డి మూవీ మొదటి రోజు మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మొదటి రోజు ఈ మూవీ ఏకంగా 32 కోట్ల రూపాయలను షేర్ వసూలు చేసింది. విడుదలైన మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లు అందుకున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది.నైజాం, సీడెడ్, ఈస్ట్, వెస్ట్ ఇంకా అలాగే ఉత్తరాంధ్ర అన్ని చోట్లా చాలా అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది ఈ సినిమా. విడుదలైన తొలి రోజే అన్ని ఏరియాల్లో కలిపి మొత్తం రూ.50 కోట్ల గ్రాస్‌ను ఇంకా రూ.32 కోట్ల షేర్ ని సాధించినట్లు సమాచారం తెలుస్తోంది. ఇక ఈ సినిమా అమెరికాలో ఒక్కరోజే 708,000 డాలర్ల వసూళ్లను అందుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. త్వరలోనే 1మిలియన్ డాలర్లను కూడా అధిగమిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: