వాల్తేరు వీరయ్య: పూనకాలు లోడెడ్.. అరుపులే?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగుతోపాటు హిందీలో కూడా వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయింది.అమెరికాలో మొత్తం 1200 స్క్రీన్స్ లో మూవీని రిలీజ్ చేశారు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో  1200 థియేటర్స్ లో సినిమా విడుదల అయింది. మెగాస్టార్ చిరంజీవి ఇంకా మాస్ మహారాజ్ రవితేజ అలాగే శృతిహాసన్ కాంబినేషన్ లో ఈ మూవీ తెరకెక్కింది. థియేటర్ల దగ్గర మెగా ఫ్యాన్స్ ఒక రేంజిలో సంబరాలు చేసుకుంటున్నారు.సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సంధ్య థియేటర్ దగ్గర మెగా అభిమానుల కోలాహలం మాములుగా లేదు. మెగా అభిమానులు బాణసంచా కాల్చి ఎంతగానో సంబరాలు చేసుకున్నారు. జై చిరంజీవి, స్టార్.. స్టార్ మెగా స్టార్ అన్న నినాదాలతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు మొత్తం ఎంతగానో మార్మోగుతోంది. ఇక మెగా అభిమానులతో కలిసి చిత్ర యూనిటీ సినిమా చూస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ బాబీ ఇంకా దర్శకుడు హరీశ్ శంకర్ సంధ్య థియేటర్ కు వచ్చారు.


మెగాస్టార్ చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజ కూడా థియేటర్ లో ఎంతగానో సందడి చేశారు. అభిమానులతో కలిసి మూవీ చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చెప్పే డైలాగ్స్, ఆయన వేసే స్టెప్పులకు విపరీతమైన స్పందన వస్తోంది. నిజంగానే థియేటర్ లో అభిమానులకు పూనకాలు రప్పిస్తోంది ఈ సినిమా. చిరు స్టెప్పులకు మెగా ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆరు షోలకు అనుమతి ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజామున 4 గంటలకే షోలు  పడ్డాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో తెల్లవారుజామున 4 గంటలకే సినిమా షో స్టార్ట్ అయ్యింది. థియేటర్ కు మెగాస్టార్ చిరంజీవి ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చారు. థియేటర్స్ లోపల, బయట అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. పేపర్స్, పూలు స్క్రీన్స్ పై వేస్తూ ఫ్యాన్స్ బాగా హంగామా చేశారు. ఈలలు వేస్తూ సినిమాని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అరుపులు ఇంకా కేకలతో థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతోంది.మొత్తానికి వింటేజ్ చిరంజీవి ఈజ్ బ్యాక్ అనిపించింది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: