దిల్ రాజు మాటను కూడా విజయ్ వినడం లేదా..?

Divya
ప్రముఖ తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బడానిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వారసుడు. ఈ సినిమాను బైలింగ్వల్ గా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే . అయితే తమిళ్లో వరిసు పేరిట ఈ సినిమాను జనవరి 11వ తేదీన రిలీజ్ చేశారు. ఒక రకంగా పరవాలేదు అనిపించుకున్న ఈ సినిమా తెలుగులో విడుదల కాబోతున్న వారసుడు సినిమాపై నెగటివ్ ప్రభావం చూపించే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు వెల్లడించారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కు స్టార్ హీరో ఇమేజ్తో పనిలేదు. కథా కంటెంట్ నచ్చితే ఎవరికైనా సరే ఓటేస్తారు ఈ క్రమంలోనే వారసుడు సినిమా ప్రేక్షకులకు పెద్దగా నచ్చేటట్టు కనిపించడం లేదు.
మరోపక్క విజయ్ కూడా అందుకు తగ్గట్టుగానే ప్రవర్తించడం అందరికీ అసహనం కలిగిస్తోంది.  ఎందుకంటే వరిసు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన విజయ్ తెలుగులో వారసుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినప్పుడు హాజరు కాలేదు. పైగా తెలుగులో ఎప్పుడు కూడా ప్రమోషన్స్ చేపట్టలేదు.  ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. దిల్ రాజు మాటను కూడా వినడం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వారసుడు సినిమా కోసం దిల్ రాజు విజయ్ కి  ఏకంగా రూ.120 కోట్లకు పైగా పారితోషకం అందించాడు.  సినిమాకి  కూడా రూ.250 కోట్లకు పైగానే బడ్జెట్ అయింది.
ముఖ్యంగా విజయ్ మీద నమ్మకంతోనే దిల్ రాజు ఇలా బడ్జెట్ ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.  ఇలాంటి సమయంలో ఇప్పుడు విజయ్ దిల్ రాజు మాట వినడం లేదు అనే వార్తలు పుకార్లుగా వినిపిస్తున్నాయి . అసలు విషయం ఏమిటంటే వారసుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాని విజయ్ ఈసారి ప్రెస్ మీట్ కు కచ్చితంగా వస్తారు అని దిల్ రాజా తెలిపారు. కానీ ఈసారి ప్రెస్ మీట్ కూడా ఆయన దాటవేశారు.  మొత్తానికైతే జనవరి 14న అంటే రేపు తెలుగులో వారసుడు సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో విజయ్ ఇలా ప్రవర్తించడం నిజంగా సినిమాపై నెగటివ్ ప్రభావం పడే అవకాశం ఉంది  అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: