విలన్ గా కెరియర్ మొదలెట్టి.. స్టార్ హీరోలుగా మారింది వీళ్లే?
ఇలాంటి వాళ్లలో చిరంజీవి రజినీకాంత్ లాంటి మెగాస్టార్ సూపర్ స్టార్లతో పాటు నేటితరంలో గోపీచంద్ లాంటి హీరోలు కూడా విలన్ గా కెరియర్ మొదలుపెట్టి హీరోగా రాణిస్తున్నారు.. వారెవరో తెలుసుకుందాం.
చిరంజీవి : ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి విలన్ గానే కెరియర్ మొదలు పెట్టారు. కుక్కకాటుకు చెప్పు దెబ్బ, మోసగాడు, 47 రోజులు లాంటి సినిమాల్లో తన విలనిజం పండించి ఆ తర్వాత హీరోగా చిన్న చిన్న సినిమాలు చేస్తూ స్టార్గా ఎదిగాడు.
కృష్ణంరాజు : ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా స్టార్ హీరోగా హవా నడిపించిన కృష్ణంరాజు నేనంటే నేనే, భలే మాస్టర్ లాంటి సినిమాల్లో విలన్ గా ప్రస్తానని మొదలుపెట్టి తర్వాత హీరోగా అవతారం ఎత్తాడు.
రజనీకాంత్ : ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా కొనసాగుతున్న రజనీకాంత్ కథ సంగమం, జాను, బాలు వంటి సినిమాల్లో విలన్ గా నటించి ఆ తర్వాతే హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాప్ లో కొనసాగుతున్నాడు.
మోహన్ బాబు : కలెక్షన్ కింగ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోహన్ బాబు తలంబ్రాలు సినిమాలో విలనిజం పండించి ఆ తర్వాతే హీరోగా అవతారం ఎత్తాడు.
రాజశేఖర్ : టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మాన్ గా స్టార్ హీరోగా హవా నడిపించిన రాజశేఖర్ ప్రెసిడెంట్ గారి పెళ్ళాం అబ్బాయిగారు.. వారసుడు లాంటి సినిమాల్లో విలన్ గా నటించి ఆ తర్వాతే హీరోగా కెరియర్ మొదలుపెట్టారు
వీళ్ళు మాత్రమే కాకుండా శ్రీకాంత్, శ్రీహరి, రవితేజ, గోపీచంద్ లాంటి ఎంతోమంది స్టార్ హీరోలు సైతం విలన్ గా ప్రస్తానాని మొదలుపెట్టి హీరోగా మారి ఇక ఇప్పుడు స్టార్లుగా కొనసాగుతున్నారు.