బంపర్ ఆఫర్ కొట్టేసిన వీరసింహరెడ్డి..!?

Anilkumar
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమా ఎవరు ఊహించిన విధంగా మూడు రోజులు వాయిదా పడింది. దీంతో థియేటర్లపరంగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలకు అతిపెద్ద చిక్కు పోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రెండు సినిమాలకు గౌరవాన్ని ఇచ్చి దిల్ రాజు తమ నిర్ణయాన్ని మార్చుకోవడం అని చెప్పడంతో 12న విడుదల కానున్న వీర సింహారెడ్డి సినిమాకి ఎంత స్థాయిలో మేలు జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఒకరోజు ముందే తెగింపు సినిమా వస్తున్నప్పటికీ అజిత్ మార్కెట్ దృశ్య దీనిమీద ట్రేడ్ సైతం భారీ ఆశలు ఏమి పెట్టుకోలేదు.

 అయితే ఈ సినిమా విడుదలైనప్పటికీ ఈ సినిమాని ఫస్ట్ ఛాయిస్ గా ఎవరు పెద్దగా చూడరు, కాబట్టి ఈ సినిమా 11వ తేదీన విడుదలైనప్పటికీ ఇంకో 24 గంటలు ఆగితే వీర సింహారెడ్డి సినిమా విడుదలవుతుంది. అయితే ఏ విధంగా చూసినా కూడా వీరసింహారెడ్డికి బాగానే లాభాలు వచ్చి పడతాయి. స్క్రీన్ కౌంట్  కూడా భారీగా ఉంటుంది. దీంతో కావాల్సినన్ని థియేటర్లు ఈ సినిమాకి దొరుకుతాయి. అయితే ఈ సినిమా విడుదలై మొదటి రోజే మంచి హిట్ టాక్ మీ గనక తెచ్చుకుంటే సినిమా విడుదలైన మూడు నాలుగు రోజుల వరకు అడ్వాన్స్ బుకింగ్ ఫుల్ అయిపోతుంది.

 ఇక దాని అనంతరం విడుదలయ్యే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకి ఈ సౌలభ్యం ఉండదు. అయితే ముందు బాలయ్య తర్వాత దిల్ రాజు ఉంటారు కాబట్టి సర్దుకుపోవాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అప్పుడు పరిస్థితులు మారుతాయి. ఇందులో భాగంగానే వీర సింహారెడ్డి మొదటి రోజే 20 నుండి 30 కోట్ల దాకా షేర్షను ఈజీగా వస్తుందని డిస్ట్రిబ్యూటర్లు అంచనాలు వేస్తున్నారు. ఇక ఈ అవకాశాన్ని వీరి సింహారెడ్డి మంచిగా వాడుకుంటే కలెక్షన్ల పరంగా మంచిగా రాబట్టొచ్చు అని అంటున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలోనే ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది అని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో చాలా ఎక్కువ ట్రస్టులో ఉన్నాయని అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని భావిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: