ఆ స్టార్ హీరోయిన్ తో ఒక్క సినిమా కూడా చేయని ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

Anilkumar
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో హీరోయిన్ల కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని తమ అభిమానులు కోరుకుంటారు. అయితే చాలా కాలంగా టాలీవుడ్ లో ఒక కాంబినేషన్ కోసం తమ అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు. ఇక అది ఎవరో కాదు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత .అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ఇప్పటివరకు ప్రభాస్ అనుష్క, పూజా హెగ్డే, నయనతార, శ్రేయ వంటి హీరోయిన్ లతోనే  సినిమాలు చేసినప్పటికీ ఒక్కసారి కూడా సమంతతో సినిమా చేయలేదు. 

అయితే వీరి ఇద్దరి మధ్య హైట్ ప్రాబ్లం ఉండడం కారణంగానే ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి సినిమా చేయలేదు అని తెలుస్తుంది. అయితే గతంలో కొరటాల శివ మరియు ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన మిర్చి సినిమా   అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ముందు సమంతను తీసుకుందామని భావించారట. కానీ ప్రభాస్ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదట. ఇక ప్రభాస్ ఒప్పుకోకపోవడంతో ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా రీచాను  తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఏదేమైనాప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా ఖచ్చితంగా

 రావాలని వీరి అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ మరియు ఇటు సమంతా కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుంటుంది అని అంటున్నారు వీరి అభిమానులు. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. సమంత ప్రస్తుతం యశోద సినిమా సక్సెస్ అనంతరం శాకుంతలం సినిమా విడుదల పనులలో బిజీగా ఉంది. మరో వైపు మయోసైటీస్  అనే వ్యాధితో బాధపడుతున్న సమంత తాజాగా కోలుకొని మళ్ళీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: