ఫిదా సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఎవరో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ మరియు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమా అప్పట్లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీవీలో వస్తే ఇప్పటికీ ఎంతో ఆసక్తిగా ఈ సినిమాని చూస్తారు ప్రేక్షకులు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ఎంతటి క్రేజ్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో సాయి పల్లవి నటన అత్యద్భుతంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సాయి పల్లవిది కేరళ.

అయినప్పటికీ తెలంగాణ యాసలో మాట్లాడి ఈ సినిమాతో అందరిని ఆకట్టుకుంది. ఫిదా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో దాని అనంతరం వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది సాయి పల్లవి. ఈమనే కాకుండా వరుణ్ తేజ్ కూడా ఆయన కెరియర్ లోని బిగ్గెస్ట్ హిట్టుగా ఫిదా సినిమా నిలిచింది. అయితే ఈ సినిమా వచ్చి ఇన్నేళ్లు అయినప్పటికీ తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఫిదా సినిమాలో మొదటగా వరుణ్  ని అనుకోలేదట. ఈ సినిమాలో హీరోగా నటించడానికి ముందుగా మహేష్ బాబుని అనుకున్నారట.

ఇక మహేష్ బాబుకి కథ వినిపించిన అనంతరం కొన్ని కారణాలవల్ల ఈ సినిమాలో మహేష్ బాబు చేయడం కుదరలేదు. ఇక దాని అనంతరం ఈ సినిమా నిర్మాత అయిన దిల్ రాజు వరుణ్ తేజ్ ని హీరోగా తీసుకుందాం అని సలహా ఇవ్వడంతో వరుణ్ ని ఈ సినిమాలో హీరోగా చేయడం జరిగింది. ఇక సాయి పల్లవి కోసం చిత్ర బృందం ఏకంగా ఆరు నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమా కథ మొదట సాయి పల్లవికి వినిపించినప్పుడు ఆమే తన డాక్టర్ కోర్స్ అప్పటికి పూర్తి చేయలేదు. అనంతరం తన డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా చేసింది. అత్యంత తక్కువ బడ్జెట్ తో ఎక్కిన ఈ సినిమా భారీ వసూలను రాబట్టింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: