100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిన ధమాకా..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో ఎన్నో మూవీలలో చిన్న చిన్న పాత్రలో నటించి గుర్తింపును తెచ్చుకున్న రవితేజ ఆ తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకొని అందులో భాగంగా అనేక విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

అందులో భాగంగా తాజాగా రవితేజ "ధమాకా" అనే పక్క రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించాడు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గ నటించగా ... ఈ మూవీ కి బీమ్స్ సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ పోయిన సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్స్డ్ టాక్ లభించింది.  

అయినప్పటికీ ఈ మూవీకి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఖిలడి ... రామారావు ఆన్ డ్యూటీ మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను ఎదుర్కొన్న రవితేజ "ధమాకా" మూవీ తో మంచి విజయాన్ని అందుకొని మళ్ళీ ఫామ్ లోకి తిరిగి వచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: