కళ్యాణ్ రామ్ అమిగోస్ టీజర్ రిలీజ్ డేట్ లాక్..!

Divya
కొత్త దర్శకుడు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో బింబిసారా సినిమా మంచి కమర్షియల్ హిట్ సాధించిన తర్వాత హీరో కళ్యాణ్ రామ్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఏకంగా రెండు సినిమాలను సెట్ పైకి తీసుకురావడం జరిగింది. అందులో ఒకటి డెవిల్ చిత్రం కాగా మరొకటి అమిగోస్. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను గురువారం రిలీజ్ చేశారు. ఇక ఎప్పుడు రిలీజ్ కానుంది అనే విషయానికి వస్తే జనవరి 8 ఉదయం 11:07 గంటలకు అమిగోస్ టీజర్ను రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిబుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  కళ్యాణ్ రామ్ హీరోగా ప్రయోగాత్మక కథాంశంతో రూపొందుతున్న చిత్రం అమిగోస్. ఇప్పటికే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు పాత్రలకు సంబంధించి పోస్టర్లను విడుదల చేశారు.  ఇప్పుడు  మూడవ పాత్రకు సంబంధించి క్యారెక్టర్ని కూడా రివీల్ చేసారు చిత్ర బృందం.  ఇకపోతే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. రాజేంద్రరెడ్డి దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ క్రమంలోనే టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ కళ్యాణ్ రామ్ కొత్త పోస్టర్ ను  కూడా రిలీజ్ చేశారు.
ఇందులో కళ్యాణ్ రామ్ పొడవైన గడ్డంతో. వెనుక కొప్పు కట్టుకొని.. భుజం పై గన్ను పట్టుకొని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చాలా మాస్ గా కనిపిస్తున్నాడు. ఇకపోతే కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే మూడు పాత్రలు కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా పూర్తి భిన్నంగా ఉంటాయని సమాచారం.  ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.  అంతేకాదు ఇందులో కళ్యాణ్ రామ్ సరసన అషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది.  ఈమెకు తెలుగులో ఇదే మొదటి చిత్రం కావడం గమనార్హం. మరీ ఈ సినిమా ఈమెకు ఎంతవరకు గుర్తింపు తీసుకొస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: