మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అలాంటి ప్లాన్ వేసిన బాలయ్య.. !?

Anilkumar
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మరి కొద్ది రోజుల్లోనే 'వీరసింహారెడ్డి' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జనవరి 12న సంక్రాంతి కానుకగా వీర సింహారెడ్డి థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో బాలయ్య జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాల్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు మీడియాకు కనిపించని మోక్షజ్ఞ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాడు. ఈమధ్య సోషల్ మీడియాలో మోక్షజ్ఞ కు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అలాగే తండ్రి తో కలిసి మోక్షజ్ఞ కొన్ని కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు.

ఇక రీసెంట్ గా అన్ స్టాపబుల్ టాక్ షోలో పవన్ కళ్యాణ్ వచ్చిన ఎపిసోడ్లో మోక్షజ్ఞ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన వీర సింహారెడ్డి మేకింగ్ వీడియోలో తన తండ్రితో కలిసి కనిపించాడు మోక్షజ్ఞ. అలాగే మొన్నా మధ్య 'హిట్2' సినిమాని తన తండ్రితో కలిసి వీక్షించాడు. అలా మొన్నటిదాకా మీడియా కంటబడని మోక్షజ్ఞ ఇప్పుడు వరుస ఈవెంట్స్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. అటు బాలయ్య కూడా తన కొడుకుని ఈ సంవత్సరం హీరోగా పరిచయం చేయాలని చూస్తున్నారు. అందుకే మోక్షజ్ఞని తన సినిమా షూటింగ్స్ కి తీసుకెళ్తున్నాడట బాలయ్య.

అంతా అనుకున్నట్లు జరిగితే అప్పట్లో స్వర్గీయ నందమూరి తారకరామారావు బాలయ్యను ఎలా అయితే సినీ పరిశ్రమకు తీసుకొచ్చారో.. ఇప్పుడు బాలయ్య కూడా తన దర్శకత్వంలో కొడుకుని హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని ఆదిత్య 369 సీక్వెల్ గా రాబోయే 'ఆదిత్య  999 మ్యాక్స్' ప్రాజెక్టుతోనే మోక్షజ్ఞ హీరో ఎంట్రీ ఉండబోతుందని అంటున్నారు. ఇప్పటికే బాలయ్య స్వయంగా అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు త్వరలోనే బాలయ్య స్వయంగా గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: