ప్రైమ్ వీడియో నుంచి హిట్ 2 సినిమా ఔట్.. అదే కారణమా..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం 'హిట్ 2'. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా గతంలో విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కిన 'హిట్' సినిమాకి సీక్వల్ గా తెరకెక్కింది. దర్శకుడు శైలేష్ కొలను దీన్ని ఓ ఫ్రాంచైజీలా రూపొందిస్తున్నాడు. వాల్ పోస్టర్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని ఈ సినిమాని నిర్మించాడు. ఇక డిసెంబర్ రెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకుంది. అంతేకాదు భారీ కలెక్షన్లను సైతం కొల్లగొట్టింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ సొంతం చేసుకోగా..

 జనవరి 4వ తేదీ మంగళవారం రోజు ఈ సినిమాని ఆమెజాన్ ప్రైమ్  రెంట్ రూపంలో చూడ్డానికి వీలు కల్పించింది. అయితే సినిమా విడుదలై నెల రోజులు ముగియడంతో ఎలాంటి అప్డేట్ లేకుండా డైరెక్ట్ గా ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేసింది. అయితే తాజాగా ఈ సినిమా ఆమెజాన్ ప్రైమ్ లో కనిపించడం లేదు. ఏమైందో తెలియదు కానీ కనీసం రెంటల్ బేస్ లో కూడా ఈ సినిమా అందుబాటులో లేదు. ఎటువంటి ముందస్తు అప్డేట్ ఇవ్వకుండా అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా క్యాటలాగ్ నుంచి టైటిల్ని తీసేసింది. అంటే ప్రస్తుతం ఆమెజాన్ ప్రైమ్ నుండి హిట్ 2 సినిమాని తొలగించారు. దీనికి అసలు కారణం ఏంటో ఇప్పటి వరకు తెలియరాలేదు.

కాకపోతే మళ్లీ ఈ సినిమాని జనవరి 6 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సదరు సంస్థ తెలియజేసింది. జనవరి 6 నుంచి ఎలాంటి రెంట్ లేకుండా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్లు ఉచితంగా వీక్షించేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ సంస్థ తెలిపింది. ఇక థియేటర్లో ఈ సినిమాని మిస్ అయిన ఫ్యాన్స్ ఓటిటిలో ఎప్పుడు వస్తుందని ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మొత్తంగా జనవరి 6న అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కాగా హిట్ 2 మంచి విజయం అందుకోవడంతో.. ఇప్పుడు 'హిట్ 3' పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక హిట్ 3 లో నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే హిట్ 2 సినిమా క్లైమాక్స్ లో ఈ విషయాన్ని రివిల్ చేసాడు దర్శకుడు. ఇక ఈ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో హీరో నాని భాగం కావడంతో హిట్ 3 పై భారీ అంచనాలు నెలకొన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: