"వీర సింహారెడ్డి" ట్రైలర్ విడుదల అనౌన్స్మెంట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ఆఖరుగా అఖండ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది . అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి మూవీ లో హీరో గా నటించాడు.

ఈ మూవీ కి తమన్ సంగీతం అందించగా ... శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. దునియా విజయ్ విలన్ పాత్రలో నటించిన ఈ మూవీ లో ... వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో నటించింది . ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటివరకు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ రోజు ఈ సినిమా నుండి మాస్ మొగుడు అనే సాంగ్ ను విడుదల చేయనున్నారు .
 

ఈ సాంగ్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే వీర సింహా రెడ్డి మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన ఒక అప్డేట్ ను విడుదల చేసింది . ఈ మూవీ యొక్క ట్రైలర్ విడుదల తేదీని అతి త్వరలోనే ప్రకటించ బోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది . ఇప్పటివరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: