10 వ రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలక్షన్లను వసూలు చేసిన 5 మూవీలు ఇవే..!
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 16.10 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ ప్రస్తుతం టాప్ 1 పొజిషన్ లో కొనసాగుతుంది. ఈ మూవీ లో మేక పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు.
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 మూవీ విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.55 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన అనుష్క ... తమన్నా హీరోయిన్ లుగా నటించారు.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 1 సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన 10 వ రోజు 5.45 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో ప్రభాస్ హీరోగా నటించగా అందాల ముద్దుగుమ్మలు అనుష్క మరియు తమన్నా ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు.
మాస్ మహారాజ రవితేజ తాజాగా ధమాకా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.20 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో శ్రీ లీల రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా విడుదల అయిన 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.88 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించింది.