నాన్నగా నాని.. 30వ సినిమా ఫస్ట్ వీడియో అదిరింది..!

shami
నేచురల్ స్టార్ నాని హీరోగా నూతన దర్శకుడు శౌరివ్ డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాని వైరా క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. సినిమా ఎనౌన్స్ మెంట్ ని చేస్తూ నాని ఓ చిన్న పాపతో సినిమాలో తన కూతురుగా చేస్తున్న పాపతో సంభాషణ జరుపుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. సినిమాలో నువ్వు ఎవరు ఉండాలని అనుకుంటే వారు ఉంటారంటూ రిలీజ్ చేసిన వీడియో అదిరిపోయింది.
రెండు రోజులుగా వార్తల్లో ఉన్న మృణాల్ ఠాకూర్ నే ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. కొత్త దర్శకుడు శౌరివ్ ని పరిచయం చేస్తూ నాని 30వ సినిమా వస్తుంది. ఈ వీడియోలో నాని మరోసారి ఓ మంచి ఎమోషనల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని అనిపిస్తుంది. దసరాలో గెడ్డంతో కనిపించబోతున్న నాని ఈ సినిమా కోసం గడ్డం, మీసం తీసేసి కనిపిస్తారట. అదే విషయాన్ని చెబుతూ రిలీజ్ చేసిన వీడియో చాలా బాగుంది.
నాని జెర్సీ సినిమాలో ఆల్రెడీ ఫాదర్ రోల్ చేశాడు. మళ్లీ ఇప్పుడు 30వ సినిమా కోసం కూడా తండ్రి పాత్రలో నటిస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా నాని కెరీర్ లో మరో ప్రత్యేకమైన సినిమాగా అవుతుందని చెప్పొచ్చు. సినిమాలో నాని సరసన మృణాల్ కూడా ఈ ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ తీసుకు రానుంది. సీతారామం తో ఆమె తెలుగులో సూపర్ పాపులర్ అయ్యింది. మరి నాని 30 నుంచి వచ్చిన ఈ స్పెషల్ వీడియో సినిమాపై ఒక మంచి అభిప్రాయాన్ని ఏర్పరచిందని చెప్పొచ్చు. చూస్తుంటే నాని ఈసారి మరో ఎమోషనల్ కథతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడని తెలుస్తుంది. నానితో మృణాల్ జోడీ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని చెప్పొచ్చు. త్వరలో సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమాతో నాని ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: