ఇన్నేళ్ల తర్వాత చిరంజీవికి గట్టి పోటీ ఇవ్వనున్న బాలకృష్ణ.!
మొదటిసారి 1984లో బాలకృష్ణ నటించిన మంగమ్మగారి మనవడు.. చిరంజీవి నటించిన ఇంటిగుట్టు చిత్రాలు మూడు రోజుల వ్యవధిలో విడుదలయ్యాయి. ఈ రెండింటిలో కూడా సుహాసిని హీరోయిన్గా నటించింది. అయితే మంగమ్మగారి మనవడు సూపర్ హిట్ అయ్యి ఆమెకు మంచి గుర్తింపు అందించింది. ఆ తర్వాత 1984 లోనే డిసెంబర్లో బాలకృష్ణ, చిరంజీవి కథానాయకుడు, రుస్త్రుం సినిమాలతో పోటీ పడి చిరంజీవి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు..
ఇక అలా ప్రతి ఏడాది వీరిద్దరూ సంక్రాంతి బరిలో పోటీ పడేవారు. అలా చివరిగా 2017 వ సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పోటీపడ్డ వీరిద్దరూ.. బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి.. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలతో సంక్రాంతి పండుగకు పోటీపడ్డారు. అయితే రెండు చిత్రాలు కూడా విజయం సాధించాయి. ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల తర్వాత వీరిద్దరు మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో సంక్రాంతి బరిలో దిగబోతున్నారు. ఇకపోతే రెండు సినిమాల నుంచి విడుదలైన టీజర్లు, పోస్టర్లు , పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వీరసింహారెడ్డి సినిమాతో పోల్చుకుంటే వాల్తేరు వీరయ్య సినిమాకు భారీ ఫాలోయింగ్ పెరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈసారి కూడా చిరంజీవి పై చేయి సాధించబోతున్నారు అని తెలుస్తోంది.