ఘనంగా గూడచారి-2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్..!

Divya
అడవి శేష్ హీరోగా నటించిన గూడచారి సినిమా ఏ రేంజిలో కలెక్షన్స్ సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా భారీ స్థాయిలో విజయాన్ని అందుకొని.. ఈ సినిమా సీక్వెల్ కు దారితీసింది . ఈ క్రమంలోనే గూడచారి 2 సినిమా సీక్వెల్ కూడా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదలకు సిద్ధం చేయబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నే చాలా ఘనంగా నిర్వహించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
డైరెక్టర్ రాహుల్ పాకాల దర్శకత్వంలో అడవి శేషు హీరోగా శోభిత ధూళిపాల హీరోయిన్గా తెరకేక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ లుక్కును విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోని వచ్చే ఏడాది అనగా 2023 జనవరి 9వ తేదీన ముంబై మరియు ఢిల్లీలో గూడచారి 2 సినిమా ప్రీ  రిలీజ్ ఫంక్షన్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.  ఈ మేరకు పలువురు ఫ్యాన్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై  తెగ ఆసక్తి కనబరిస్తున్నారు.  నిజానికి అడవి శేష్ ఎలాంటి సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరే అది తప్పకుండా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ఈ క్రమంలోని గూడచారి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈయన ఇటీవల మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకేక్కిన సినిమాలో నటించి  మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం హిట్ సినిమా సీక్వెల్ హిట్ 2లో నటించి భారీ విజయాన్ని అందుకున్న అడవి శేషు ఇప్పుడు కూడా గుడచారి 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు.  ఇలా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అడవి శేష్ ఇప్పుడు గూడచారి 2 తో ఎలాంటి విజయాన్ని పొందుతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: