పూజా హెగ్డే ని చూసి బెంబేలెత్తిపోతున్న నిర్మాతలు..?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తను నటించిన మొదటి సినిమాతోనే ప్లాప్ అందుకున్న పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాని అనంతరం ఈమె నాగచైతన్య సరసన నటించిన ఒక లైలా సినిమా తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. దాని అనంతరం ముకుంద సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించిన ఈమె ఈ సినిమా కూడా పెద్దగా హిట్టును అందుకోలేకపోయింది. అలా కెరియర్ మొదలుపెట్టిన ప్రారంభంలోనే ఈమె నటించిన సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ లు అవ్వడంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ లేడీ గా తనకంటూ ముద్ర వేసుకుంది పూజ హెగ్డే. 

దాని అనంతరం  అల్లు అర్జున్ తో నటించిన డీజే మరియు అలా వైకుంఠపురం సినిమాలతో మళ్ళీ హిట్టులను అందుకుంది ఈమె. దాని అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన రంగస్థలం సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో నటించి  మంచి గుర్తింపును తెచ్చుకుంది ఈమె. ఇక దాని అనంతరం జూనియర్ ఎన్టీఆర్ సరసన అరవింద సమేత సినిమాలలో నటించింది ఈమె. మహేష్ బాబు సరసన మహర్షి సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా హిట్లు ఫ్లాపులతో సతమతమవుతున్న ఈమె దాని అనంతరం చాలా ఏళ్ల తర్వాత మళ్లీ గోల్డెన్ లెగ్ గా  పేరును సంపాదించుకుంది.

అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించి మళ్లీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 2022వ సంవత్సరంలో ఈమె చేసిన సినిమాలు అన్నీ  కూడా వరుసగా ప్లాప్ లను అందుకున్నాయి. ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. దాని అనంతరం తమిళంలో బీస్ట్ సినిమాలో ఈమె నటించినప్పటికీ ఆ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందుకోలేదు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇలా వరుస ఫ్లోప్ లను అందుకుంటున్న ఈమెతో సినిమాలు చేయాలంటే దర్శక నిర్మాతలు సైతం భయపడుతున్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి. ఇక వచ్చే ఏడాదైనా మంచి విజయాన్ని పూజా హెగ్డే అందుకుంటుందా లేదా చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: