జబర్దస్త్ రాకేష్.. యాంకర్ రష్మీని ఇలా అనేసాడేంటి?

praveen
యాంకర్ రష్మీ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు వరకు సినిమాల్లో చిన్నాచితక పాత్రలు చేస్తూ ఎవరికీ తెలియని రష్మీ గౌతమ్ ఇక జబర్దస్త్ అనే కార్యక్రమంలో యాంకర్ గా ప్రత్యక్షమైన తర్వాత మాత్రం తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ సుపరిచితురాలుగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతూ వస్తుంది. అదే సమయంలో సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ  తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది ఈ ముద్దుగుమ్మా .

 ఇటీవల కాలంలో ఈటీవీలో జబర్దస్త్ లో మాత్రమే కాదు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా యాంకరింగ్ చేస్తూ తన అందం అభినయంతో  తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో యాంకర్లుగా ఉన్న వారిపై కమెడియన్స్ పంచులు వేయడం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు అయితే ఏకంగా పర్సనల్ లైఫ్ ని కూడా టార్గెట్ చేస్తూ పంచులు వేస్తూ ఉంటారు కమెడియన్స్. అయితే ఇటీవల రష్మీ పై జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ వేసిన పంచ్ మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి.

 ఇటీవల విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇందులో భాగంగా రాకింగ్ రాకేష్ స్కిట్ లో ఒక దొంగ స్వామీజీ గెటప్ లో కనిపించారు రాకేష్. ఇక తన పక్కనే ఉన్న ప్రవీణ్ యాంకర్ రష్మి జాతకం చెప్పమని రాకేష్ ను అడుగుతాడు. దానికి రాకింగ్ రాకేష్ బదులు ఇస్తూ సాధారణంగా అందరూ డబ్బులు లేకపోతే గుండెలు బాదుకుంటారు. కానీ రష్మీ మాత్రం గుండెలు బాదుకుంటూ డబ్బులు సంపాదించింది అంటూ ఇక రష్మి చేసే గున్న గున్న మామిడి అనే సాంగ్ డాన్స్ పై సెటైర్ వేశాడు రాకింగ్ రాకేష్. కాగా గత కొంతకాలం నుంచి యాంకర్ రష్మీ గున్న గున్న మామిడి అనే పాట పై డాన్స్ చేస్తూ బాగా పాపులారిటీ సంపాదించింది. ఇలా రష్మీ గుండెలు బాదుకుంటూ సంపాదిస్తుందంటూ రాకింగ్ రాకేష్ కామెంట్ చేయడంతో రష్మి ని ఇలా అనేసాడు ఏంటి అంటూ అనుకుంటున్నారట ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: