పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన ప్రదీప్..!?

Anilkumar
ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న టాప్ మేల్ యాంకర్లలో ప్రదీప్ కూడా ఒకరు. గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రాం తో ఫేమస్ అయిన ఈయన ప్రస్తుతం డీ జోడి వంటి షోలతో  టాప్ యాంకర్ గా కొనసాగుతున్నాడు. ఇక అమ్మాయిల్లో ప్రదీప్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాంకర్ గా ఈయన ఎన్నో ఈవెంట్లలో ,ఆడియో ఫంక్షన్ లో, అవార్డ్ ఫంక్షన్లలో, ప్రోగ్రాంలలో, వెండితెరపై కూడా కొన్ని సినిమాలలో నటించడం జరిగింది.ఇక ఈయన హీరోగా నటించిన 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా అప్పట్లో మంచి హిట్ టాక్ను అందుకుంది.

 సినిమాలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలలో నటించాడు. గత కొన్ని రోజులుగా ప్రదీప్ పెళ్లికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ మధ్యకాలంలో ప్రదీప్ స్వయంవరం అనే ఒక షోను పెట్టి ఆ షోలో గెలిచిన అమ్మాయిని నిజంగానే పెళ్లి చేసుకుంటాడు అన్నట్లుగా నమ్మించారు. కానీ అది అంతా షో పరంగా మాత్రమే. దీనికిగాను ప్రదీప్ కి ఇంత వయసు వచ్చినప్పటికీ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ఈయనపై చాలామంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ప్రదీప్ ఒక ఫ్యాషన్ డిజైనర్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికిగాను ఆ అమ్మాయి పేరుని కూడా బయట పెట్టడం జరిగింది. నవ్య అనే ఫ్యాషన్ డిజైనర్ని ప్రదీప్ పెళ్లి చేసుకుంటున్నాడు అని అంతేకాదు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు అంటూ అనేక రకమైన వార్తలు రావడం జరిగింది. తాజాగా వీటన్నిటికీ క్లారిటీ ఇచ్చాడు ప్రదీప్. ఇక ఆయన మాట్లాడుతూ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని వచ్చే వార్తలలో ఎలాంటి నిజం లేదు.. మీరు చెప్పే ఆ అమ్మాయి నవ్య ఎవరో కూడా నాకు తెలియదు... కనీసం అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు కూడా అంటూ తన పెళ్లిపై వస్తున్న రూమర్ల గురించి క్లారిటీ ఇచ్చాడు. దాంతోపాటు ఇప్పుడైతే నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ చెప్పుకొచ్చాడు. 2023లో మరో సినిమాతో మీ ముందుకు వస్తాను అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు ప్రదీప్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: