పవన్ ని బాలయ్య షోకి రప్పించడంపై అసలు విషయం చెప్పేసిన అల్లు అరవింద్..?

Anilkumar
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నారు అనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.అయితే పవన్ కళ్యాణ్ రానున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పటివరకు బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షో కి చాలామంది సినీ సెలబ్రిటీలు రావడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ వస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఇక పవన్ కళ్యాణ్ ఈ షో కి రావడానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంది. అదేంటంటే గతంలో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను మరియు ఆయన పార్టీని ఉద్దేశించి కొన్ని అనుచితమైన వ్యాఖ్యలను బాలయ్య చేయడం జరిగింది.  

బాలయ్య చేసిన ఆ వ్యాఖ్యలను పలు సభల్లో పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించారు. ఇక అప్పట్లో జరిగిన లేపాక్షి ఉత్సవాలకు కూడా పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించలేదు. కనీసం చిరంజీవి నైనా ఆహ్వానిస్తారా అన్న ప్రశ్నకు బాలయ్య సమాధానంగా దానికి ఒక స్టేచర్ ఉండాలని అన్నారు. దాని అనంతరం బాలకృష్ణ జనసేన పార్టీలో ఉన్నదంతా అలాగా జనం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక బాలయ్య చేసిన ఇలాంటి వ్యాఖ్యలు అన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ ఆయన మీటింగ్లలో చెప్పుకొస్తూనే ఉన్నాడు. అయితే ఇలా ఒకప్పుడు ఇద్దరు వివాదాలలో నిలిచిన వ్యక్తులు ఒకే షో కి రావడం అందరిలో ఆసక్తి నెలకొంది.

 తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టిడిపి మరియు జనసేన మధ్య మంచి ఒప్పందం కుదరాలని రెండు పార్టీల మధ్య మంచి అనుబంధాన్ని నెలకొల్పాలని పవన్ కళ్యాణ్ ని బాలకృష్ణ ఈ షోకు రప్పిస్తున్నట్లుగా కూడా అనేకమైన వార్తలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ రాబోతున్న ఈ ఎపిసోడ్ షూట్ లో పాల్గొన్నారు అల్లు అరవింద్.ఇక ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ షో ప్రారంభించినప్పుడు ఈ స్థాయిలో హిట్ అవుతుందని మేము అస్సలు అనుకోలేదు. ఇండియాస్ బిగ్గెస్ట్ టాప్ షో గా ఈ షో నిలిచింది అంటూ చాలామంది అంటున్నారు. ఇక తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాబోయే ఎపిసోడ్ తో ఈ షో మరింత హిట్ అవుతుందని ఇలాంటి ఎపిసోడ్ మరొకటి ఎప్పటికీ రాదు అని ఈ సీజన్ కి ఇది మంచి  ఎపిసోడ్ అని ఆఖరిగా ఈ షో కి పవన్ కళ్యాణ్ వస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు అల్లు అరవింద్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: