రవితేజకి ఓకే.. చరణ్ కి నాట్ ఓకే..!

shami
మాస్ మహరాజ్ రవితేజ తన ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ సినిమాతో ధమాకా అంటూ వచ్చాడు. ప్రసనన్న కుమార్ రైటర్ గా నక్కిన త్రినాథ రావు డైరెక్షన్ లో వచ్చిన ధమాకా మూవీ క్రిస్ మస్ సందబ్ర్హంగా రెండు రోజుల ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. రవితేజ మార్క్ మాస్ మూవీగా ధమాకా బాక్సాఫీస్ దగ్గర దంచికొడుతుంది. అయితే ఈ సినిమా కథ ముందు రవితేజ దగ్గరకు రాలేదట. సినిమాని మెగా హీరోత్ చేయాలని అనుకున్నారట. కానీ ఇలాంటి రొటీన్ కథలను కాదనడం నేర్చున్నాడు ఆ మెగా హీరో.
ఇంతకీ ధమాకా కాదన్న మెగా హీరో ఎవరంటే ఆర్.ఆర్.ఆర్ హీరో రాం చరణ్ అని తెలుస్తుంది. స్టార్ క్రేజ్ తెచ్చుకున్న హీరో తనకు ఏ కథ సూట్ అవుతుంది. ఏ కథ పర్ఫెక్ట్ హిట్ అవుతుంది అన్నది గెస్ చేయగలిగి ఉండాలి. అలానే చరణ్ కూడా ధమాకా కథ వినగానే ఇది మనకు సూట్ అవదని ఫిక్స్ అయ్యాడట. అలా ఫిక్స్ అవడమే తనకు కలిసి వచ్చింది. రవితేజ మాత్రం తనకున్న మాస్ ఫాలోయింగ్ కి ఈ కథ నడిచిపోతుందని ఓకే చెప్పాడు. అనుకున్నట్టుగానే ధమాకా మాస్ రాజా ఫ్యాన్స్ కి ఎక్కేసింది.
ధమాకా రవితేజకి ఓకే కానీ రాం చరణ్ కి నాట్ ఓకే. కథల విషయంలో ఈమధ్య చరణ్ చాలా క్లవర్ గా మారాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత శంకర్ తో సినిమా చేస్తున్న రాం చరణ్ గౌతం తిన్ననూరి కథను లాక్ చేశాడని అన్నారు. కానీ ఎక్కడో కథలో తేడా వచ్చి రిస్క్ ఎందుకు అనుకుని లైట్ తీసుకున్నాడు. చరణ్ వదిలిన ఆ సినిమాను విజయ్ పిక్ చేసుకున్నాడు. అలా రాం చరణ్ ధమాకా రవితేజ చేయగా గౌతం తిన్ననూరి సినిమా కూడా రౌడీ హీరో దగ్గరకు వెళ్లింది. అయితే ఆర్సీ 15 మూవీ తర్వాత చరణ్ ఉప్పెన సెన్సేషన్ బుచ్చి బాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రాం చరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: