బాలయ్య, నాగార్జున మధ్య భగ్గుమంటున్న గొడవలు..?

murali krishna
సినీ పరిశ్రమలో బయట అంతా బాగానే ఉన్నా  కానీ లోలోపల లుకలుకలు ఎన్నో ఉంటాయి. యువ హీరోల విషయం పక్కన పెడితే సీనియర్ స్టార్ హీరోల మధ్య విభేదాలు చాలా ఉంటాయి.
వీరంతా కూడా ఒక తరం ముందు వారు. అప్పుడు సోషల్ మీడియా లేకపోవటంతో గొడవలు అయితే నాలుగు గోడలకే తెలిసేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోల పీఆర్ టీమ్స్ నుండే కొన్ని లీకులు వస్తుంటాయి. మేకప్ మెన్, హెయిర్ డ్రెస్సర్స్, పీఏలు, డ్రైవర్లు ఇలా సినీ తారలకు పని చేసిన వారంతా యూట్యూబ్ లో వారి గుట్టు రట్టు చేస్తున్నారు. అయితే నాగార్జున బాలకృష్ణల మధ్య విబేదాలు ఉన్నమాట టాలీవుడ్ లో అందరికి కూడా తెలిసిందే. ఏఎన్నార్, ఎన్టీఆర్ ల వార్ వారి వారసులు అయితే కొనసాగిస్తున్నారు. అప్పట్లో నాగేశ్వరావు చనిపోయిన తరువాత పెట్టిన సభకి ఇండస్ట్రీ నుండి దిగ్గజాలు అందరు వచ్చినా కూడా బాలయ్య మాత్రం గైర్హాజరయ్యారు. నాగార్జున కనీసం బాలయ్యకి ఆహ్వానం కూడా ఇవ్వలేదని పెద్ద ఎత్తున రూమర్స్ కూడా వచ్చాయి. అయితే మళ్ళీ ఒక సినిమా ఈవెంట్ లో బాలయ్య, నాగార్జునలు ఎదురుపడి షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకున్నారు. కానీ ఇద్దరి మోహంలో చిరు నవ్వు కూడా లేదు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ నాగ్ మైక్ అందుకుని చెప్పినా.. ఆ తరువాత కూడా వీరి వైనం కొనసాగుతూ నే వస్తుంది.
తాజాగా నాగార్జున బాలకృష్ణల మధ్య విభేదాలు ముదిరాయని న అంటున్నారు. బిగ్ బాస్ షో కారణంగా వీరిమధ్య గొడవలు మరోసారి బయటపడ్డాయని తెలుస్తుంది.. వరుసగా 4 బిగ్ బాస్ సీజన్స్ కి హోస్టింగ్ చేసిన నాగార్జున సీజన్ 7 నుండి తప్పుకున్నాడంటు వార్తలు కూడా వస్తున్నాయి. నాగ్ స్థానంలో బాలకృష్ణ హోస్టింగ్ చేయనున్నట్టు ప్రచారం కూడా జరుగుతుంది. బిగ్ బాస్ 6కి తక్కువ టీఆర్పీలు రావటంతోనే బాలయ్య డేట్స్ కోసం బిగ్ బాస్ వెంపర్లాడుతున్నట్టు రూమర్ కూడా ఉంది. అయితే ఈ వార్తలో నిజం ఎంతుందో కానీ.. బిగ్ బాస్ 7కి బాలయ్య హోస్ట్ అయితే.. బిగ్ బాస్ సెట్ కోసం అన్నపూర్ణ స్టూడియో ఇవ్వనంటూ నాగార్జున చెప్పినట్టు మరో వార్త కూడా తాజాగా వైరల్ అవుతుంది. అయితే బాలకృష్ణ కూడా అన్నపూర్ణ స్టూడియోలో సెట్ అంటే రానే రానంటూ బిగ్ బాస్ యాజమాన్యానికి ఎప్పుడో చెప్పేశాడట. ఈ కండిషన్ కి ఒకే అయితే నాకు హోస్టింగ్ చేయడానికి అస్సలు అభ్యంతరం లేదని తనని రీసెంట్ గా కలిసిన బిగ్ బాస్ టీమ్ తో బాలయ్య చెప్పినట్టు రూమర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: