ఇండ్రస్ట్రీ లోకి రాకముందు ఈ సింగర్ అలాంటి పనులు చేసిందా..?

Anilkumar
పుష్ప సినిమాలోని ఉ అంటావా మామ పాట వినగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఈ పాట పాడిన సింగర్ ఇంద్రావతి చౌహన్ పేరు. సాధారణంగా హీరోలు మరియు హీరోయిన్లు వారికి ఒక్క హిట్ సినిమా పడితే చాలు ఓవర్ నైట్ స్టార్ అయిపోతుంటారు. ఇక అలాగే సింగర్ ఇంద్రావతి చౌహన్ కూడా పుష్ప సినిమాలో ఈ ఒక్క పాట పాడి ఓవర్ నైట్ స్టార్ గా అయిపోయింది. ఈ సినిమాకి ముందు ఎన్నో సినిమాలలో పాటలు పాడిన ఈమె ఆ పాటలతో అంతటి గుర్తింపును తెచ్చుకోలేకపోయింది. కానీ పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ పాడిన అనంతరం ఏ సింగర్ కి లేని పాపులారిటీ

 ఈమెకి లభించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సింగర్ పుష్ప సినిమాలో పాట పాడడానికి ముందు ఒక న్యూస్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది. దాని అనంతరం నటిగా కూడా మంచి గుర్తింపును పొందింది. అయితే ఈమె ప్రముఖ సింగర్ మంగ్లీ సోదరి అన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. గతంలో బోల్ బేబీ బోల్ అనే పాటల కార్యక్రమంలో కూడా ఇంద్రావతి చౌహన్ పాటలు పాడింది. వాటితో పాటు జార్జిరెడ్డి అనే సినిమాలో  కూడా ఒక పాట పాడింది ఈమె. ఇక ఆ సమయంలో సుకుమార్ ఈమెని చూడడం జరిగింది.

దాని అనంతరం ఈమెకు పుష్ప సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ పాడడానికి అవకాశాన్ని ఇచ్చాడు సుకుమార్. పుష్ప  సినిమాలో పాట పాడిన అనంతరం ఈమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ పాటకు గాను ఈమె కొన్ని అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇంద్రావతి చౌహాన్ కి పుష్ప సినిమాలో పాట పాడిన అనంతరం అనేక సినిమాలలో పాటలు పాడే అవకాశం సైతం దక్కింది. గత కొన్ని రోజులుగా పుష్ప 2  సినిమాలో కూడా ఈమె మరొక పాటని పాడబోతుంది అనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమాలో కూడా ఈమె పాట పాడితే ఆ పాట ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలని బన్నీ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: